Rahul Dravid : ద్ర‌విడ్ మౌనం ప‌రాజ‌యం పాఠం

హెడ్ కోచ్ పై విమ‌ర్శ‌ల వెల్లువ

Rahul Dravid : ప్ర‌పంచ క్రికెట్ చ‌రిత్ర‌లో త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్ స్వంతం చేసుకున్న క్రికెట‌ర్ గా రాహుల్ ద్ర‌విడ్ కు పేరుంది.

ప్ర‌స్తుతం బీసీసీఐ చీఫ్ సౌర‌వ్ గంగూలీ ప్ర‌త్యేకంగా ద్ర‌విడ్ (Rahul Dravid)కు టీమిండియా హెడ్ కోచ్ ప‌ద‌వి అప్ప‌గించాడు.

ఇండియ‌న్ క్రికెట్ అకాడెమీ ద్వారా ఎంతో మంది యువ క్రికెట‌ర్ల‌ను త‌యారు చేశాడు ద్ర‌విడ్. ప్ర‌స్తుతం భార‌త జ‌ట్టుకు అన్ని ఫార్మాట్ ల‌లో కావాల్సిన ఆట‌గాళ్ల కంటే ఎక్కువ మంది క్యూలో ఉన్నారు ప్లేయ‌ర్లు.

ఈ ఘ‌న‌త అంతా ద్ర‌విడ్ దే. జూనియ‌ర్ టీమ్ కు కోచ్ గా ఉన్నాడు. అంత‌కు  ముందు భార‌త మాజీ స్టార్ ప్లేయ‌ర్ ర‌విశాస్త్రి హెడ్ కోచ్ గా సేవ‌లు అందించాడు.

కెప్టెన్ కోహ్లీతో క‌లిసి అద్భుత విజ‌యాలు సాధించేలా తీర్చి దిద్దాడు ర‌విశాస్త్రి భార‌త జ‌ట్టును.

ఇంగ్లండ్ టూర్ త‌ర్వాత తాను త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించాడు శాస్త్రి.

ఇదే స‌మ‌యంలో యూఏఈ వేదిక‌గా జ‌రిగిన టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ త‌ర్వాత కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు కోహ్లీ. బీసీసీఐ దిద్దుబాటు చ‌ర్య‌లకు దిగింది.

విరాట్ కోహ్లీ స్థానంలో రోహిత్ శ‌ర్మ‌కు టీ20, వ‌న్డే కెప్టెన్సీ అప్ప‌గించింది. సౌతాఫ్రికా టూర్ లో భార‌త జ‌ట్టు టెస్టు సీరీస్ కు స్కిప్ప‌ర్ గా ఉన్న కోహ్లీ సీరీస్ కోల్పోవ‌డంతో తాను సార‌థ్య బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించాడు.

దీనిపై తీవ్ర దుమారం చెల‌రేగింది. బీసీసీఐ వ‌త్తిళ్ల వ‌ల్ల‌నే అత‌డు రిజైన్ చేశాడంటూ మాజీ క్రికెట‌ర్లు ఆరోపించారు.

స్వ‌దేశంలో కీవీస్ తో విజ‌యం సాధించినా స‌ఫారీ టీంతో వ‌న్డే, టెస్టు సీరీస్ లు కోల్పోవ‌డం ద్ర‌విడ్(Rahul Dravid) కోచ్ పై తీవ్ర ప్ర‌భావం చూపింది.

రాహుల్ ద్ర‌విడ్  చాలా కూల్ గా ఉండాల‌ని అనుకుంటాడు. తాత్కాలిక కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించిన కేఎల్ రాహుల్ నాయ‌క‌త్వ లోపం కూడా ఓట‌మికి కార‌ణ‌మ‌న్న ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

ద్ర‌విడ్ మంత్రం ప‌ని చేయ‌లేద‌న్న అప‌వాదు మిగిలి పోయింది. ఇక స్వ‌దేశంలో జ‌రిగే సీరీస్ ల‌లోనైనా భార‌త జ‌ట్టు గెల‌వాల‌ని కోరుకుంటున్నారు ఫ్యాన్స్.

Also Read : చ‌తేశ్వ‌ర్ పుజారా వెరీ స్పెష‌ల్

Leave A Reply

Your Email Id will not be published!