UAE T20 Leauge : దుబాయ్ క్యాపిటల్స్ టీమ్ డిక్లేర్
పూర్తి జట్టును ప్రకటించిన ఫ్రాంచైజీ
UAE T20 Leauge : ఏ ముహూర్తాన లలిత్ మోడీ ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్ ) ను స్టార్ట్ చేశాడో కానీ ఇవాళ ప్రపంచాన్ని నివ్వెర పోయేలా చేస్తోంది. ఇవాళ అత్యధిక జనాదరణ పొందిన క్రీడా ఈవెంట్ లలో ఐపీఎల్ ఒకటిగా నిలిచింది.
ఒకటా రెండా ఏకంగా వేలాది కోట్ల రూపాయలు దీని ద్వారా ఆదాయం సమకూరుతోంది. ప్రస్తుతం ఐపీఎల్ దెబ్బకు ఇతర దేశాలు లబోదిబో మంటున్నాయి. కానీ తలవంచక తప్పడం లేదు.
రాను రాను సంప్రదాయ క్రికెట్ టెస్టు మ్యాచ్ లు ఉండవేమోనన్న ఆందోళన నెలకొంది. ఇక ఐపీఎల్ లాంటి టోర్నీలకు శ్రీకారం చుడుతున్నాయి.
ఇప్పటికే సౌతాఫ్రికా టి20 లీగ్ ను డిక్లేర్ చేసింది. అయితే ఇక్కడ పాల్గొనేందుకు బీసీసీఐ భారత ఆటగాళ్లకు పర్మిషన్ ఇవ్వడం లేదు. ఒక వేళ అందులో ఆడాలని అనుకుంటే తమతో కాంట్రాక్టు రద్దు చేసుకోవాలని గంగూలీ స్పష్టం చేశాడు.
ఇక దుబాయ్ వేదికగా వచ్చే ఏడాది యూఏఈ టి20 లీగ్(UAE T20 Leauge) జరగనుంది. ఇందులో భాగంగా దుబాయ్ క్యాపిటల్స్ ఫ్రాంచైజీని ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం జీఎంఆర్ గ్రూపు స్వంతం చేసుకుంది.
యాజమాన్యం ఇవాళ తమ జట్టును డిక్లేర్ చేసింది. ఈ లీగ్ లో ఆరు జట్లు ఆడతాయి. వీటిలో 5 జట్లను ఇండియన్ ఫ్రాంచైజీలు చేజిక్కించు కోవడం విశేషం.
ఇక దుబాయ్ క్యాఇటల్స్ టీమ్ ఇలా ఉంది. పావెల్ , హజ్రతుల్లా జజాయ్, డేనియల్ లారెన్స్ , జార్జ్ మున్సే , భానుక రాజపక్సే , నిరోషన్ డిక్వెల్లా , దాసున్ షనుక, సికందర్ రజా, ఫాబియన్ అలెన్ , ఇసురు ఉదానా, ముజీబ్ ఉర్ రెహమాన్ , దుష్యంత చమీర, క్లాస్సేన్ , ముజార బానీ ఉన్నారు.
Also Read : ధావన్ ధనా ధన్ గిల్ సెన్సేషన్