Girish Mahajan : లవ్ జిహాద్ వల్లే తునీషా సూసైడ్
మరాఠా మంత్రి గిరీష్ షాకింగ్ కామెంట్స్
Girish Mahajan : మహారాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నటి తునీషా శర్మ శనివారం సీరియల్ షూటింగ్ సమయంలో సూసైడ్ కు పాల్పడ్డారు. ఆమె మరణానికి ప్రధాన కారణం సహ నటుడు షీజాన్ ఖాన్ అని తల్లి ఆరోపించింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆదివారం తెల్లవారుజామున నటుడు షీజాన్ ఖాన్ ను అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరు పరిచారు. విచారణకు సంబంధించి నాలుగు రోజుల కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే తునీషా శర్మ, షీజాన్ ఖాన్ ఇద్దరూ ప్రేమించు కున్నారని , కానీ గత 15 రోజుల కిందట ఖాన్ తునీషా శర్మకు బ్రేకప్ చెప్పాడని సమాచారం.
దీంతో ఆమె తట్టుకోలేక సూసైడ్ కు పాల్పడిందని నిర్ధారణకు వచ్చాయి. అయితే ఆత్మహత్య చేసుకుందా లేక హత్య చేసి అలా చేశారా అన్న కోణంపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన మరాఠాలో తీవ్ర కలకలం రేపింది. భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యే రామ్ కదమ్ షాకింగ్ కామెంట్స్ చేశారు.
తునీషా శర్మ కేసు వెనుక లవ్ జిహాద్ ఉందని ఆరోపించారు. ఆమె కుటుంబాన్ని ఆదుకుంటామని ప్రకటించారు. తాజాగా మరాఠా మంత్రి గిరీష్ మహాజన్ సైతం(Girish Mahajan) లవ్ జిహాద్ కారణమని పేర్కొనడం కలకలం రేపింది. ఈ మేరకు లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా కఠినమైన చట్టాన్ని తీసుకు వస్తామని స్పష్టం చేశారు మంత్రి.
అయితే ఈ కేసులో లవ్ జిహాద్ కోణం లేదని సీనియర్ పోలీసు ఆఫీసర్ చంద్రకాంత్ జాదవ్ తెలిపారు.
Also Read : శ్రద్దా వాకర్ కేసుతో భయపడ్డా – ఖాన్