EC Notice Sonia Gandhi : సోనియా కామెంట్స్ ఈసీ నోటీస్

సోనియా గాంధీ కామెంట్స్ పై ఫిర్యాదు

EC Notice Sonia Gandhi : కేంద్ర ఎన్నిక‌ల సంఘం బిగ్ షాక్ ఇచ్చింది. ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేకు నోటీసు జారీ చేసింది. క‌ర్ణాట‌క‌లో ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో ఏఐసీసీ మాజీ చీఫ్ సోనియా గాంధీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆమె క‌ర్ణాట‌క రాష్ట్రానికి సార్వ భౌమాధికారం క‌లిగి ఉండాల‌ని పేర్కొన్నారు. దీనిపై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది భార‌తీయ జ‌న‌తా పార్టీ.

ఇలాంటి వ్యాఖ్య‌లు రాష్ట్రాన్ని విభ‌జించేలా ఉన్నాయ‌ని, ఇది ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను దెబ్బ తీస్తుంద‌ని, అందుకే సోనియా గాంధీపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది.

దీనిపై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కోరుతూ కేంద్ర ఎన్నిక‌ల సంఘం(EC Notice) మంగ‌ళ‌వారం ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేకు నోటీసు జారీ చేసింది. ఇప్ప‌టికే మోదీపై అనుచిత వ్యాఖ్య‌లు చేసినందుకు వాయ‌నాడు ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీపై అన‌ర్హ‌త వేటు వేసింది. మొత్తంగా బీజేపీ పూర్తిగా వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల నాటికి కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాల‌ని ప్లాన్ వేసిన‌ట్లుగా ఉంది.

ఒక రాష్ట్రానికి సార్వ భౌమాధికారం గురించిన ఏదైనా వ్యాఖ్య వేర్పాటు సూచ‌న‌కు స‌మాన‌మ‌ని ఫిర్యాదులో పేర్కొంది. ఇదిలా ఉండ‌గా క‌ర్ణాట‌క‌, సార్వ భౌమాధికారం లేదా స‌మ‌గ్ర‌త‌కు ముప్పు క‌లిగించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎవ‌రినీ అనుమ‌తించ‌ద‌ని అన్నారు సోనియా గాంధీ(Sonia Gandhi). ఇదే విష‌యాన్ని మే 6న ఇందుకు సంబంధించి కాంగ్రెస్ ట్వీట్ చేసింది.

Also Read : క‌న్న‌డ నాట కింగ్ పిన్ ఎవ‌రో

Leave A Reply

Your Email Id will not be published!