Nitish Kumar Patnaik : ప‌ట్నాయ‌క్ తో నితీశ్ కుమార్ భేటీ

బీజేపీకి ప్ర‌త్యామ్నాయం ఏర్పాటు

Nitish Kumar Patnaik : జేడీయూ చీఫ్‌, బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఫుల్ బిజీగా మారారు. భార‌తీయ జ‌న‌తా పార్టీకి ప్ర‌త్యామ్నాయంగా విపక్షాల‌ను ఏకం చేసే ప‌నిలో ప‌డ్డారు నితీశ్ కుమార్. ఇప్ప‌టికే ఆయ‌న ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, మాజీ సీఎం రాహుల్ గాంధీ, ఆప్ క‌న్వీన‌ర్ , ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ , టీఎంసీ చీఫ్ , బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ తో పాటు ఎస్పీ చీఫ్, మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్ తో భేటీ అయ్యారు.

ఇందులో భాగంగా మంగ‌ళ‌వారం ఒడిశా సీఎం నవీన్ ప‌ట్నాయ‌క్ ములాఖ‌త్ కు రెడీ అయ్యారు. ఇప్ప‌టికే శ‌ర‌ద్ ప‌వార్ తో కూడా చ‌ర్చించేందుకు ముంబైకి రానున్నారు బీహార్ సీఎం నితీశ్ కుమార్.

ఇదిలా ఉండ‌గా భార‌త దేశ రాజ‌కీయాల‌లో ఇద్ద‌రు సీఎంలు నితీశ్ , న‌వీన్ ప‌ట్నాయ‌క్(Nitish Kumar Patnaik) లు సుదీర్ఘ కాలం పాటు కొలువు తీరారు. ఇద్ద‌రూ గ‌తంలో బీజేపీతో క‌లిసి ఉన్నారు. ఇటీవ‌ల నితీశ్ కుమార్ కాషాయ పార్టీతో క‌టీఫ్ చెప్పారు. కాంగ్రెస్ , ఆర్జేడీతో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు.

ప్ర‌స్తుతం బీజేపీని రాబోయే ఎన్నిక‌ల్లో లేకుండా చేయాల‌నే సంక‌ల్పంతో విప‌క్షాల‌ను క‌లిపే ప్ర‌య‌త్నం చేయ‌డంలో బిజీగా మారారు నితీశ్ కుమార్. ఇంకా డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ , బీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేసీఆర్ ఉన్నారు. ఇవాళ ప‌ట్నాయ‌క్ తో భేటీ కానుండ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఇదిలా ఉండ‌గా మే 18న ఢిల్లీలో ప్ర‌తిప‌క్ష నేత‌లంద‌రితో భారీ స‌మావేశానికి ప్లాన్ చేశారు నితీశ్ కుమార్.

Also Read : సోనియా కామెంట్స్ ఈసీ నోటీస్

Leave A Reply

Your Email Id will not be published!