MP Sanjay Singh : బీజేపీ గుర్తింపును ఈసీ ర‌ద్దు చేయాలి

ఆప్ ఎంపీ సంజ‌య్ సింగ్ డిమాండ్

MP Sanjay Singh : ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజ‌య్ సింగ్(MP Sanjay Singh) భార‌తీయ జ‌న‌తా పార్టీపై నిప్పులు చెరిగారు. దేశంలో ఇప్ప‌టికే ఎనిమిది రాష్ట్రాల‌లో బీజేపీయేత‌ర ప్ర‌భుత్వాల‌ను కూల్చిన వేసిన ఘ‌న‌త ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా, పార్టీ చీఫ్ జేపీ న‌డ్డాల‌కే ద‌క్కుతుంద‌న్నారు.

తెలంగాణ‌లో బ‌ల‌మైన టీఆర్ఎస్ స‌ర్కార్ ను కూల్చే కుట్ర‌కు తెర తీశార‌ని ఇందులో అడ్డంగా బుక్ అయ్యారంటూ ఆరోపించారు సంజ‌య్ సింగ్. దేశంలో ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేసే వ్య‌వ‌హారాన్ని తెర వెనుక నుండి అమిత్ షా న‌డిపిస్తున్నారంటూ ఆరోపించారు. ఈ విష‌యంలో గులాబీ పార్టీకి చెందిన న‌లుగురు ఎమ్మెల్యేలు బ‌ట్ట‌బ‌య‌లు చేశార‌ని పేర్కొన్నారు.

ఇప్ప‌టికే జార్ఖండ్ లో ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు ప్ర‌య‌త్నం చేసిన బీజేపీ ఆప‌రేష‌న్ క‌మ‌లం పూర్తిగా అట్ట‌ర్ ప్లాప్ అయ్యిందంటూ ధ్వ‌జ‌మెత్తారు. దేశంలో అప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ చిల్ల‌ర రాజ‌కీయాలు చేస్తున్న భార‌తీయ జ‌న‌తా పార్టీని , దాని గుర్తింపును కేంద్ర ఎన్నిక‌ల సంఘం వెంట‌నే ర‌ద్దు చేయాల‌ని సంజ‌య్ సింగ్(MP Sanjay Singh) డిమాండ్ చేశారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆప‌రేష‌న్ ఫెయిల్ అయ్యింద‌ని, ముందుగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను అరెస్ట్ చేసి విచారణ జ‌ర‌పాల‌ని డ‌మాండ్ చేశారు ఎంపీ. అప్పుడైతే అస‌లు విష‌యాలు వెలుగులోకి వ‌స్తాయ‌న్నారు. ఢిల్లీతో పాటు పంజాబ్ లో సైతం త‌మ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేసేందుకు బీజేపీ య‌త్నించింద‌ని కానీ ఫెయిల్ అయ్యింద‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : మీ సీఎంను మీరే ఎన్నుకోండి – కేజ్రీవాల్

Leave A Reply

Your Email Id will not be published!