Gangula Kamalakar ED : మంత్రి గంగుల కమలాకర్ కు బిగ్ షాక్
బంధువుల ఇళ్లు, ఆఫీసుల్లో ఈడీ దాడులు
Gangula Kamalakar ED : మునుగోడు ఉప ఎన్నిక ముగిశాక సీన్ మారింది. మరింత ఆసక్తిని, ఉత్కంఠను రేకెత్తిస్తోంది తెలంగాణలోని రాజకీయాలు. నిన్నటి దాకా నువ్వా నేనా అన్న రీతిలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య సాగిన మాటల యుద్దానికి తెర పడింది. ఇక చర్యలకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కు కోలుకోలేని షాక్ ఇచ్చాయి ఈడీ(Gangula Kamalakar ED), ఐటీ శాఖలు.
గ్రానైట్ వ్యాపార లావాదేవీలలో స్కాం చోటు చేసుకుందనే ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు జల్లెడ పడుతున్నాయి. రాష్ట్ర పోలీసులతో సంబంధం లేకుండా నేరుగా సీఆర్పీఎఫ్ దళాలు రావడం విశేషం. హైదరాబాద్ , కరీంనగర్ లోని 15 ప్రాంతాల్లో ఆదాయపు పన్ను శాఖ తో కలిసి సోదాలు చేపట్టాయి. మంత్రి గంగుల, బంధువుల ఇళ్లు, ఆఫీసుల్లో దాడులు చేపట్టాయి. గ్రానైట్ కంపెనీలు, క్వారీలపైనే ఫోకస్ పెట్టడం విశేషం.
ఉమ్మడి ఏపీలో జరిగిన గ్రానైట్ ఎగుమతుల స్కాంకు సంబంధించిన కేసులో ఈడీ, ఐటీ సోదాలు చేపట్టినట్లు సమాచారం. ఈ దాడులు ఉదయం నుంచి రాత్రి దాకా కంటిన్యూగా కొనసాగుతూ వచ్చాయి. సోదాల్లో భాగంగా పీఎస్ఆర్ గ్రానైట్ ఆఫీసు, సోమాజి గూడ లోని గ్రానైట్ వ్యాపారి శ్రీధర్ ఆఫీస్ , రాజేంద్ర నగర్ లోని జనప్రియ అపార్ట్ మెంట్స్ లో ఉన్న ఇంట్లో దాడులు చేపట్టారు.
శ్వేత గ్రానైట్స్ , పీఎస్ఆర్ గ్రానైట్స్ , గ్రానైట్స్ అసోసియేషన్, అరవింద్ వ్యాస్ కంపెనీ, ఎస్వీజీ గ్రానైట్స్ ఆఫీసులు, శంకరపట్నం, కొత్తపల్లి, బావుపేట లోని క్వారీల్లోనూ జల్లెడ పట్టాయి ఈడీ, ఐటీ అధికారులు.
Also Read : మడమ తిప్పం కేసీఆర్ పై యుద్దం ఆపం