ED Fine Amnesty India : అమ్నెస్టీ ఇండియాకు ఈడీ షాక్

రూ. 51.72 కోట్ల జ‌రిమానా విధింపు

ED Fine Amnesty India : కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్ర‌భుత్వం స్వ‌చ్చంధ సంస్థ‌ల‌పై ఫోక‌స్ పెట్టింది. విదేశాల నుంచి వ‌చ్చే నిధుల వ్య‌వ‌హారంపై విచార‌ణ చేప‌ట్టింది. ఈ మేర‌కు గ‌త కొన్నేళ్లుగా స్వ‌చ్చంధ సంస్థ‌ల పేరుతో జ‌రుగుతున్న త‌తంగాన్ని బ‌ట్ట‌బ‌య‌లు చేసింది.

తాజాగా అమ్నెస్టీ ఇంట‌ర్నేష‌న‌ల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ‌కు కోలుకోలేని షాక్ త‌గిలింది. ఈ మేర‌కు ఫెమా ఉల్లంఘ‌న‌ల కింద ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్(ED Fine Amnesty India) శుక్ర‌వారం అమ్నెస్టీ ఇండియా భారీ జ‌రిమానా విధించింది.

ఇందులో భాగంగా నోటీసులు జారీ చేసింది. అంతే కాకుండా సంస్థ‌కు సంబంధించి మాజీ చీఫ్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీస‌ర్ ఆక్ష‌ర్ ప‌టేల్ కు కూడా ఫైన్ విధించిన‌ట్లు నోటీసులో పేర్కొంది.

విదేశాల నుంచి నిధులు పొందాలంటే ముందు భార‌త ప్ర‌భుత్వం అనుమ‌తి తీసుకున్న విదేశీ విరాళాల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ చ‌ట్టం (ఎఫ్సీఆర్ఏ)కు లోబ‌డి నిధులు పొందాల్సి ఉంటుంది.

ఇప్ప‌టికే దేశంలోని వివిధ స్వ‌చ్చంధ సంస్థ‌ల ప‌నితీరుపై ఫోక‌స్ పెట్టింది కేంద్రం. అంతే కాకుండా 80సి, 80జి, 12ఏ, ఎఫ్సీఆర్ఏ కు సంబంధించి ప్ర‌తి ఏటా వివ‌రాలు కోరుతోంది.

ఆదాయ ప‌న్ను శాఖ ఫుల్ న‌జ‌ర్ పెట్టింది. దీంతో మోదీ ప్ర‌భుత్వం దెబ్బ‌కు దేశ వ్యాప్తంగా ప‌లు స్వ‌చ్చంద సంస్థ‌లు మూసుకున్నాయి. కొన్ని మాత్రం య‌ధావిధిగా ప‌ని చేస్తున్నాయి.

సేవ పేరుతో మోసానికి పాల్ప‌డుతున్న‌ట్లు ఈడీ గుర్తించింది. ఈ మేర‌కు అమ్నెస్టీ ఇంట‌ర్నేష‌న‌ల్ ఇండియా సంస్థ‌కు రూ. 51.72 కోట్ల ఫైన్ విధించింది. అంతే కాకుండా మాజీ సిఇఓకు కూడా పెద్ద ఎత్తున జ‌రిమానా విధించింది.

Also Read : ఫార్మా కంపెనీపై ఐటీ దాడులు

Leave A Reply

Your Email Id will not be published!