Nora Fatehi ED : నటి నోరా ఫతేహీని ప్రశ్నించిన ఈడీ
రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసు
Nora Fatehi ED : రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఇప్పటికే సుఖేష్ చంద్ర శేఖర్ , సహచరులపై ఈడీ విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ప్రముఖ బాలీవుడ్ నటి నోరా ఫతేహీ శుక్రవారం కేంద్ర దర్యాప్తు సంస్థ ముందు హాజరైంది.
ఈ కేసులో ఎవరెవరు పాల్గొన్నారు. కోట్ల రూపాయలు ఎలా చేతులు మారాయి. నీకు సుఖేష్ చంద్రశేఖర్ కు మధ్య ఉన్న సంబంధం ఏంటి అన్న దానిపై ఆరా తీసింది ఈడీ.
అయితే నోరా ఫతేహీ గతంలో కూడా ఈడీ(Nora Fatehi ED) ముందు విచారణకు హాజరైంది. తాను కుట్రకు బాధితురాలినని కానీ కుట్ర దారురాలిని కాదని స్పష్టం చేసింది. తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది.
విచారణలో భాగంగా నటిపై ప్రశ్నల వర్షం కురిపించింది ఈడీ. చంద్రశేఖర్ గురించి ఆరా తీయడంతో పాటు మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) లోని సెక్షన్ల కింద కేసు ఇప్పటికే నమోదు చేసింది ఈడీ. ఇవాళ ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
సుఖేష్ చంద్రశేఖర్ తో చాట్ ల స్క్రీన్ షాట్ లను కూడా పోలీసులకు చూపించింది నోరా ఫతేహీ. ఇదిలా ఉండగా సుఖేష్ చంద్రశేఖర్ రోహిణి జైలులో ఉన్నప్పుడు మాజీ రాన్ బాక్సీ యజమాని శివిందర్ సింగ్ భార్య అదితి సింగ్ నుండి రూ. 200 కోట్ల విలువైన దోపిడీ రాకెట్ ను నడిపినట్లు ఆరోపణలు వచ్చాయి.
కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ , పీఎంఓ అధికారులుగా వీరు నటించినట్లు విమర్శలు ఉన్నాయి. ఇదే కేసుకు సంబంధించి ఇంతకు ముందు మరో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను నిందితురాలిగా ఈడీ పేర్కొంది. ఇదే కేసుకు సంబంధించి తాజాగా నోరా ఫతేహిని చేర్చింది..విచారించింది ఈడీ.
Also Read : రాపర్ కాన్వే వెస్ట్ ట్విట్టర్ ఖాతా బ్లాక్