Rahul Gandhi ED : మూడో రోజు రాహుల్ ను ప్రశ్నిస్తున్న ఈడీ
దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ ఆందోళన
Rahul Gandhi ED : నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసుకు సంబంధించి కాంగ్రెస్ అగ్ర నేత, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆఫీసు ఎదుట హాజరయ్యారు. ఇప్పటి వరకు ఆయనను ఈడీ 21 గంటలు విచారించింది.
ఆయనను ప్రశ్నల వర్షం కురిపించింది ఈడీ. దర్యాప్తు సంస్థ రాహుల్ గాంధీ(Rahul Gandhi ED) ని ప్రశ్నించడం అధికార భారతీయ జనతా పార్టీ ప్రతీకార రాజకీయంలో భాగమని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.
దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఏఐసీసీ కార్యాలయం వెలుపల పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.
ఇక విచారణకు సంబంధించి రాహుల్ గాంధీ(Rahul Gandhi ED) సోమవారం ఉదయం 11.10 నిమిషాలకు వెళ్లారు. 10 గంటలకు పైగా ఆయనను ఈడీ విచారించింది. మరోసారి రెండో రోజు కూడా రావాలని స్పష్టం చేసింది.
ఎంతకూ విచారణ పూర్తి కాక పోవడంతో మూడో రోజు బుధవారం కూడా రాహుల్ గాంధీ హాజరు కావడం రాజకీయ వర్గాలలో చర్చకు దారితీసింది.
పార్టీ కార్యాలయం, ఈడీ ఆఫీసు ఎదుట కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. పోలీసులు లాఠీలకు పని చెప్పారు. పార్టీకి చెందిన అగ్ర నాయకులు అధిర్ రంజన్ చౌదరి, భూపేష్ బఘేల్ , పవన్ ఖేరా నిరసనల్లో పాల్గొన్నారు.
ఒక్క మంగళవారం రోజే రాహుల్ గాంధీని 11 గంటలకు పైగా విచారించారు. విచారణ ముగిసిన అనంతరం చెల్లెలు ప్రియాంక గాంధీతో కలిసి ఆస్పత్రిలో ఉన్న సోనియా గాంధీని కలిశారు.
ఇదిలా ఉండగా ఈనెల 23న ఈడీ ముందుకు హాజరు కావాల్సి ఉంది సోనియా గాంధీ.
Also Read : పరిశ్రమల ఏర్పాటుకు పూర్తి సహకారం