ED Raids : మెడిక‌ల్ కాలేజీల సీట్లపై ఈడీ న‌జ‌ర్

రెండో రోజూ కూడా దాడులు

ED Raids : పీజీ మెడిక‌ల్ సీట్ల బ్లాకింగ్ స్కామ్ కు సంబంధించి ఈడీ న‌జ‌ర్ పెట్టింది. ఇప్ప‌టికే తెలంగాణ‌లోని 16 ప్రాంతాల‌లో విస్తృతంగా దాడులు చేప‌ట్టింది. ఇందులో మ‌నీ లాండ‌రింగ్ చోటు చేసుకుంద‌ని గుర్తించింది. హైద‌రాబాద్, ఖ‌మ్మం, క‌రీంన‌గ‌ర్ , మ‌హూబ్ న‌గ‌ర్ లోని వివిధ ప్రాంతాల‌లో కొలువు తీరిన మెడిక‌ల్ కాలేజీల‌ను జ‌ల్లెడ ప‌ట్టారు. 2023 ఫిబ్ర‌వ‌రిలో కాళోజీ నారాయ‌ణ రావు యూనివ‌ర్శిటీ ఆఫ్ ప‌బ్లిక్ హెల్త్ సైన్సెస్ రిజిస్ట్రార్ ఫిర్యాదు దాఖ‌లు చేశారు.

వ‌రంగ‌ల్ జిల్లా మట్వాడ పోలీసులు ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌డంతో ఈడీ రంగంలోకి దిగింది. ఇందులో మ‌నీ లాండ‌రింగ్ చోటు చేసుకుంద‌ని అనుమానం వ్య‌క్తం చేసింది. కొన్ని ఏజెన్సీలు తెలంగాణ‌, ఇత‌ర రాష్ట్రాల్లోని విద్యార్థులు ప్రైవేట్ సంస్థ‌ల‌తో కుమ్మ‌క్కై సీట్ బ్లాకింగ్ లో పాల్గొంటున్న‌ట్లు ఈడీ గుర్తించింది. ఈడీ చేసిన ద‌ర్యాప్తులో యూనివ‌ర్శిటీ దాని స్వంత విచార‌ణ స‌మ‌యంలో కేఎన్ఆర్యూహెచ్ఎస్ తో కౌన్సెలింగ్ కు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోలేద‌ని వెల్ల‌డైంది.

ఐదుగురు అభ్య‌ర్థుల‌ను గుర్తించింది. ఇత‌ర రాష్ట్రాల నుంచి అత్య‌ధిక మార్కులు సాధించిన పీజీ నీట్ అభ్య‌ర్థుల ధ్రువ‌ప‌త్రాల‌ను ఉప‌యోగించి సీట్లు బ్లాక్ చేశార‌ని , మాప్ అప్ రౌండ్ కౌన్సెలింగ్ , అడ్మిష‌న్ చివ‌రి తేదీ ముగిశాక సీట్లు ఖాళీగా ఉన్నాయ‌ని యూనివ‌ర్శిటీకి నివేదించిన‌ట్లు ఈడీ ద‌ర్యాప్తు(ED Raids) లో వెల్ల‌డైంది.

ఈ సోదాల్లో పీజీ మెడిక‌ల్ అభ్య‌ర్థులు , ఎంబీబీఎస్ విద్యార్థుల నుంచి న‌గ‌దు ఫీజులు, ప్రీమియం వ‌సూలుకు సంబంధించి వంద‌ల కోట్ల రూపాయ‌ల న‌గ‌దు లావాదేవీలు, డిజిట‌ల్ ప‌రిక‌రాలను స్వాధీనం చేసుకున్నారు. లెక్క‌ల్లో చూప‌ని మ‌ల్లారెడ్డి కాలేజీ నుంచి రూ. 1.4 కోట్లు తీసుకువెళ్లారు.

Also Read : Nara Lokesh : జ‌గ‌న్ పాల‌న‌లో జ‌నం గోస

Leave A Reply

Your Email Id will not be published!