AP Temples Effect : ఆల‌యాల‌పై సూర్య‌గ్ర‌హ‌ణం ఎఫెక్ట్

తిరుప‌తి..శ్రీ‌శైలం..యాద‌గిరి గుట్ట‌

AP Temples Effect : సూర్య గ్ర‌హ‌ణం రానుండ‌డంతో ఇరు తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ‌లోని ప‌లు ప్ర‌ముఖ దేవాల‌యాల‌ను మూసి వేయ‌నున్నారు. పండితుల సూచ‌న‌ల మేర‌కు ముంద‌స్తుగా ద‌ర్శ‌నాలు బంద్ చేశారు. భ‌క్తులు ఎవ‌రూ రావ‌ద్ద‌ని కోరారు. ప్ర‌తి రోజూ వేలాది మంది ద‌ర్శించుకునే ఏపీలోని తిరుమ‌లలో శ్రీ‌వారి ఆల‌యాన్ని మూసి(AP Temples Effect) ఉంచుతారు.

ఈ విష‌యాన్ని ఇప్ప‌టికే తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ప్ర‌క‌టించింది. ఇక ఎప్ప‌టి లాగే విజ‌య‌వాడలో కొలువు తీరిన క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యంతో పాటు జ్యోతిర్లాంగాల‌లో ఒక‌టిగా ప్ర‌సిద్ది పొందిన శ్రీ‌శైలంలో కూడా శ్రీ మ‌ల్లికార్జు భ్ర‌మరాంబిక ఆల‌యాన్ని కూడా మూసి ఉంచుతామ‌ని ఈవో తెలిపారు.

మ‌హానంది కూడా ఇందులో భాగంగా ఉంది. రాష్ట్రంలోని అన్ని ప్ర‌ధాన ఆల‌యాలను మూసి ఉంచుతున్న‌ట్లు రాష్ట్ర దేవాదాయ ధ‌ర్మాదాయ శాఖ స్ప‌ష్టం చేసింది. అక్టోబ‌ర్ 25 మంగ‌ళ‌వారం దేశంలో పాక్షికంగా సూర్య గ్ర‌హ‌ణం ఏర్ప‌డ‌నుంది. గ్ర‌హ‌ణం కార‌ణంగా తిరుమ‌ల‌లో శ్రీ‌వారి ఆల‌యాన్ని ఉద‌యం 8.11 గంట‌ల నుండి రాత్రి 7.30 గంట‌ల దాకా మూసి ఉంచుతారు.

ఈ స‌మ‌యంలో అన్ని ర‌కాల ద‌ర్శ‌నాలు ర‌ద్దు చేసిన‌ట్లు తెలిపింది టీటీడీ. అంతే కాకుండా ఎప్ప‌టి లాగే విక్ర‌యించే ల‌డ్డూ విక్ర‌యం, అన్న ప్ర‌సాద విత‌ర‌ణ ఉండ‌ద‌ని పేర్కొంది. ఇక సిఫార్సు లేఖ‌లు స్వీక‌రించేది లేద‌ని స్ప‌ష్టం చేసింది టీటీడీ. గ్ర‌హ‌ణం ముగిశాక ఆల‌యాన్ని శుద్ది చేస్తారు.

ఆ త‌ర్వాత భ‌క్తుల‌ను అనుమ‌తిస్తారు. ఇంద్ర‌కీలాద్రిపై ఉన్న దుర్గ గుడి ఆల‌యం మూసి వేస్తారు. ఉద‌యం 11 గంట‌ల‌కు అమ్మ వారికి మ‌హా నివేదిన స‌మ‌ర్పిస్తారు.

Also Read : విండోస్ యూజ‌ర్ల‌కు గూగుల్ బిగ్ షాక్

Leave A Reply

Your Email Id will not be published!