Eknath Shinde CM : అట్టడుగు నుంచి అత్యున్నత స్థానం
ఏక్ నాథ్ షిండే ప్రస్థానం ఇది
Eknath Shinde CM : దేశ వ్యాప్తంగా ఎక్కువగా మార్మోమ్రోగిన ఒకే ఒక్క పేరు ఏక్ నాథ్ షిండే(Eknath Shinde CM). మహారాష్ట్రలో బలమైన శివసేన పార్టీలో మంచి పట్టున్న నాయకుడు. అంతేనా ముంబై పక్కనే ఉన్న థానేలో అతడు చెప్పిందే వేదం.
ఇంతకీ ఆయన ఎలా ఈ స్థాయికి వచ్చారనే దానిపై ఉత్కంఠ నెలకొనడం సహజం. ఒక మామూలు రిక్షా డ్రైవర్ నుంచి సీఎం దాకా అంచెలంచెలుగా ఎదిగారు.
ఏక్ నాథ్ షిండే మహారాష్ట్ర లోని సతారా లోని జువాలి తాలూకాకు చెందిన వ్యక్తి. మరాఠా కమ్యూనిటీకి చెందిన వాడు. అతడి కుటుంబం బతుకు దెరువు కోసం ముంబై శివార్ల లోని థానేకి వెళ్లింది.
ఒకప్పుడు ఆటో రిక్షా డ్రైవర్. బాల్ ఠాక్రే , ఆనంద్ దిఘేచే ప్రభావితం అయ్యాడు. 1980లో శివసేనతో అనుబంధం కలిగి ఉన్నాడు. రాజకీయకంగా మున్సిపల్ కార్పొరేషన్ కు మొదటిసారి కార్పొరేటర్ గా ఎన్నికయ్యాడు.
2002లో తిరిగి ఎన్నికయ్యాడు. 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోప్రి పచ్ పఖాడి నుంచి గెలుపొందాడు. శివసేన శాసనసభా పక్ష నేతగా ఎన్నికయ్యాడు.
2005లో శివసేన థానే జిల్లా చీఫ్ గా ఉన్నారు. 2009లో రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. 2014లో మూడోసారి శాసనసభ్యుడిగా ఎంపికయ్యారు.
2014 నుంచి 2019 వరకు మహారాష్ట్ర ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా పని చేశారు. థానే జిల్లా సంరక్షక మంత్రిగా ఉన్నారు. 2018లో శివసేన నాయకుడిగా ఎంపికయ్యారు.
2019లో మరాఠా ప్రభుత్వంలో ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశారు. 2019లో వరుసగా నాలుగోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించి చరిత్ర సృష్టించారు.
ఉద్దవ్ ఠాక్రే సారథ్యంలోని సర్కారులో పట్టణాభివృద్ది శాఖ మంత్రిగా పని చేశారు. ఇదే సమయంలో హోం శాఖ కూడా చూశారు. 2020లో జిల్లా సంరక్షక మంత్రిగా నియమితులయ్యారు. జూలై 1న తన కెరీర్ లో అత్యున్నతమైన సీఎంగా కొలువు తీరుతారు.
Also Read : మారిన మారాఠా సీన్ షిండేనే సీఎం