Ekta Kapoor Aamir Khan : అమీర్ ఖాన్ కు ఏక్తా క‌పూర్ స‌పోర్ట్

అత‌డో విలక్ష‌ణ‌మైన అద్భుత న‌టుడు

Ekta Kapoor Aamir Khan : అమీర్ ఖాన్ న‌టించిన లాల్ సింగ్ చ‌ద్దా మూవీని కొంద‌రు బహిష్క‌రించాల‌ని అనుకోవ‌డంపై ప‌లువురు స్పందిస్తున్నారు. తాజాగా ప్ర‌ముఖ నిర్మాత ఏక్తా క‌పూర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

అమీర్ ఖాన్ విల‌క్ష‌ణ‌మైన‌, అద్బుత న‌టుడు అంటూ కితాబు ఇచ్చారు. ఎందుకు ఏ కార‌ణం చేత సినిమాను బ‌హిష్క‌రించాల‌ని అనుకుంటున్నారో త‌న‌కు తెలియ‌డం లేద‌ని పేర్కొన్నారు.

తాను పూర్తిగా సినిమాకు, న‌టుడికి స‌పోర్ట్ చేస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది ఏక్తా క‌పూర్. ఆయ‌న‌ను సినిమాకు సంబంధించినంత వ‌ర‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ అని కితాబు ఇచ్చింది.

అద్వైత్ చంద‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన లాల్ సింగ్ చ‌ద్దా 1994 హాలీవుడ్ చిత్రం ఫారెస్ట్ గంప్ మూవీకి హిందీ రీమేక్. ఈ చిత్రం ఆగ‌స్టు 11న విడుద‌లైంది. మిశ్ర‌మ టాక్ తెచ్చుకుంది.

ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 50 కోట్లు కూడా దాట‌లేక పోయింది. సినిమా రంగంలో ప్ర‌త్యేకించి బాలీవుడ్ లో అమీర్ ఖాన్ త‌న‌దైన ముద్ర‌తో రాణించారు. ఆయ‌న క‌ష్ట‌ప‌డి పైకి వ‌చ్చారు.

ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఎవ‌రికి వ్య‌క్తిగ‌త విష‌యాలు వారివి. అలాగ‌ని వ్య‌క్తిగ‌త ద్వేషంతో సినిమాను బ‌హిష్క‌రించాల‌ని పిలుపు ఇవ్వ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నార‌ను ఏక్తా క‌పూర్(Ekta Kapoor).

ఇది పూర్తిగా న్యాయ స‌మ్మ‌తం కాద‌ని స్ప‌ష్టం చేసింది. ప‌రిశ్ర‌మ‌లో ముగ్గురు ఖాన్ లు ఉన్నారు. వారిని బ‌హిష్క‌రించ‌గ‌ల‌మా అని ప్ర‌శ్నించారు.

వారంతా దిగ్గ‌జ న‌టులు. వారి అభిప్రాయాలు, ఆలోచ‌న‌ల‌తో ఏకీభవించ‌క పోవ‌చ్చు. ఆ స్వేచ్ఛ‌, హ‌క్కు ప్ర‌తి ఒక్క‌రికీ ఉంది. కానీ బ‌హిష్క‌రించ‌లేమ‌ని స్ప‌ష్టం చేశారు ఏక్తా క‌పూర్.

Also Read : కాశ్మీరీ పండిట్ల‌పై దాడులు దారుణం

Leave A Reply

Your Email Id will not be published!