Congress President Poll : కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల కోలాహలం
శశి థరూర్ వర్సెస్ అశోక్ గెహ్లాట్
Congress President Poll : సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం అధ్యక్ష పదవికి సంబంధించి ఎన్నికల(Congress President Poll) ప్రక్రియ ప్రారంభమైంది. నోటిఫికేషన్ జారీ చేసింది పార్టీ.
ఈ మేరకు నామినేషన్ల ప్రక్రియ సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభమైంది. గాంధీ ఫ్యామిలీ వర్సెస్ నాన్ గాంధీ ఫ్యామిలీ మధ్య పోటీ ప్రధానంగా ఉండనుంది.
ఇందులో భాగంగా గాంధీ కుటుంబానికి చెందిన సోనియా గాంధీ(Sonia Gandhi) ప్రస్తుతం ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ గా కొనసాగుతున్నారు. ఇక తమిళనాడు లోని కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా 3,570 కిలోమీటర్ల మేర 150 రోజుల పాటు భారత్ జోడో యాత్ర చేపట్టారు.
ప్రస్తుతం ఈ యాత్ర కేరళలో కొనసాగుతోంది. ఈ తరుణంలో దేశ వ్యాప్తంగా పార్టీలోని అత్యధిక శాతం మంది రాహుల్ గాంధీ పార్టీ చీఫ్ కావాలంటూ కోరుతున్నారు.
దీంతో గాంధీ కుటుంబం నుంచి మేడం సోనియా గాంధీ ఆశీస్సులతో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్(Ashok Gehlot) పార్టీ అధ్యక్ష పదవిలో ఉండనున్నారు.
ఇక నాన్ గాంధీ ఫ్యామిలీ నుంచి అసమ్మతి వర్గానికి చెందిన తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ పోటీలో ఉంటానని ప్రకటించారు. ఇక నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది.
ఏ పార్టీలో లేని విధంగా కాంగ్రెస్ పార్టీలో బ్యాలెట్ పద్దతిన ఎన్నిక జరగనుంది. ఈనెల ఆఖరు వరకు నామిషన్లు స్వీకరిస్తారు. అక్టోబర్ 1న నామినేషన్లు పరిశీలిస్తారు.
ఆ తర్వాత అక్టోబర్ 8న అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. 17న ఎన్నికకు పోలింగ్ జరుగుతుంది. 19న అధ్యక్షుడు ఎవరనే దానిపై ఉత్కంఠ వీడనుంది.
ఈ మొత్తం వ్యవహారంలో పలువురు నామినేషన్లు దాఖలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఎన్నికల ప్రిసైడింగ్ గా ఆఫీసర్ మధుసూదన్ మిస్త్రీ ఉన్నారు. మాజీ సీఎం కమల్ నాథ్ , హూడా, పృథ్వీరాజ్ చవాన్ , తదితరులు బరిలో ఉండనున్నారు. మొత్తం 9,000 మందికి పైగా ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించు కోనున్నారు.
అయితే ప్రధానంగా పోటీ మాత్రం అశోక్ గెహ్లాట్ వర్సెస్ శశి థరూర్ మధ్య ఉండనుంది. మరి పార్టీ చీఫ్ ఎవరు గెలుస్తారనే దానిపై టెన్షన్ నెలకొంది కాంగ్రెస్ పార్టీలో.
Also Read : పంజాబ్ సీఎం మాన్ పై గవర్నర్ గుస్సా