Elizabeth Jones : భార‌త్ లో యుఎస్ రాయ‌బారిగా ‘జోన్స్’

నియ‌మించిన అమెరికా ప్ర‌భుత్వం

Elizabeth Jones : అమెరికా ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. భార‌త దేశంలో అమెరికా ప్ర‌భుత్వం త‌రపున రాయ‌బారిగా ఎలిజ‌బెత్ జోన్స‌న్ ను నియ‌మించింది. ఇటీవ‌ల ఆఫ్గ‌నిస్తాన్ పున‌రావాస ప్ర‌య‌త్నాల‌కు కోఆర్డినేట‌ర్ గా ఉన్నారు జోన్స్ . వ‌య‌సు 74 ఏళ్లు. త్వ‌ర‌లో న్యూఢిల్లీకి బ‌య‌లుదేరి వెళ‌తార‌ని అమెరికా స్ప‌ష్టం చేసింది.

ఈ మేర‌కు అధికారికంగా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ప్ర‌స్తుతం ప్యాట్రిసియా ఎ లాసినా న్యూ ఢిల్లీలోని యుఎస్ ఎంబ‌సీలో ఛార్జ్ డి అఫైర్స్ గా ఉన్నారు. ప్ర‌పంచంలో అత్యంత ప‌ర‌స్ప‌ర‌మైన ద్వైపాక్షిక భాగ‌స్వామ్యాన్ని ముందుకు తీసుకు వెళ్లేందుకు, విస్త‌రించేందుకు గాను బైడెన్ ప్ర‌భుత్వం సీనియ‌ర్ ఫారిన్ స‌ర్వీస్ ఆఫీస‌ర్ గా ఉన్న ఎలిజబెత్ జోన్స్(Elizabeth Jones) ను నియ‌మించింది.

ఎ లాసినా సెప్టెంబ‌ర్ 9, 2021న బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఇదిలా ఉండ‌గా తాజాగా కొత్త‌గా నియ‌మితులైన ఎలిజబెత్ జోన్స్ ఇంత‌కు ముందు యూర‌ప్ , యురేషియాకు స‌హాయ కార్య‌ద‌ర్శిగా ప‌ని చేశారు. నియ‌ర్ ఈస్ట్ కు తాత్కాలిక స‌హాయ కార్య‌ద‌ర్శిగా , క‌జ‌కిస్తాన్ కు రాయ‌బారిగా ఉన్నారు. ఆమె కెరీర్ ప‌రంగా అంబాసిడ‌ర్ గా టాప్ లో ఉన్నారు.

ఆమె ప‌నితీరు అద్భుతంగా ఉంది. ఎలిజబెత్ జోన్స్ నియాకం కీల‌క‌మైన‌ది. జోన్స్ అమెరికా, భార‌త దేశాల(USA – INDIA) మ‌ధ్య మ‌రింత స‌త్ సంబంధాలు పెంపొందించేలా కృషి చేస్తారన్న న‌మ్మ‌కం త‌మ‌కు ఉంద‌ని యుఎస్ స‌ర్కార్ పేర్కొంది. ఆమె పాల‌నా ప‌ర‌మైన అనుభ‌వం ఎంతో దోహ‌దం చేస్తున్న విశ్వాసం వ్య‌క్తం చేసింది.

ఇదిలా ఉండ‌గా జోన్స్ రాక‌తో ఇరు దేశాల మ‌ధ్య మ‌రింత బంధం బ‌ల‌పడే చాన్స్ ఉంది.

Also Read : మిత్ర‌మా క‌లిసి న‌డుద్దాం – మోదీ

Leave A Reply

Your Email Id will not be published!