Elon Musk Comment : మ‌స్క్ నిర్ణ‌యం ప్ర‌పంచానికి గుణ‌పాఠం

యుద్ద‌మా ఆర్థిక మాంద్యం ప్ర‌భావ‌మా

Elon Musk Comment : మ‌రోసారి ఐటీ బూమ్ ప‌డి పోనుందా. ఇత‌ర రంగాల‌కు విస్త‌రించే ఛాన్స్ ఉందా. ఇదే అనుమానం ప్ర‌పంచ వ్యాప్తంగా క‌లుగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు టాప్ లెవ‌ల్లో ఉంటూ వ‌చ్చిన మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్ట‌ర్ ఒకే ఒక్క‌డు ఎంట్రీతో కుప్ప కూలింది. త‌న కంపెనీ ప్రారంభించిన నాటి నుంచి నేటి దాకా కార్యాల‌యాల‌ను మూసి ఉంచిన దాఖ‌లాలు లేవు.

ప్ర‌పంచ కుబేరుల్లో ఒక‌డిగా ఉంటూ వ‌స్తున్న టెస్లా సిఇఓ, చైర్మ‌న్ ఎలాన్ మ‌స్క్(Elon Musk) ఇప్పుడు సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారారు. తాను

ఎప్పుడైతే రూ. 4,400 కోట్ల‌కు ట్విట్ట‌ర్ ను చేజిక్కించుకున్నాడో ఆనాటి నుంచే సంచ‌ల‌న నిర్ణ‌యాల‌కు తెర తీశాడు. ఒక వ్యాపారవేత్త‌కు ఉండాల్సిన ల‌క్ష‌ణం ఇదేనా అన్న అనుమానం క‌లుగ‌క మాన‌దు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ముఖ మార్క్సిస్ట్ త‌త్వ‌వేత్త కార్ల్ మార్క్స్ ను మ‌రోసారి గుర్తు చేసుకోక త‌ప్ప‌దు. పెట్టుబ‌డిదారుడు ఎప్పుడూ త‌న లాభం కోసం

చూసుకుంటాడు కానీ త‌న సంస్థ ఉన్న‌తి కోసం పాటుప‌డిన వారిని ప‌ట్టించు కోరు అని. ఇవాళ మ‌స్క్ చేస్తున్న‌ది ఇదే.

ర‌ష్యా యుద్దాన్ని సాకుగా చూపించి ఐటీ, లాజిస్టిక్, ఫార్మా, మీడియా,మైనింగ్..వినోదం ..వ్యాపార‌, వాణిజ్య‌, క్రీడా రంగాల‌కు చెందిన ప‌లు కంపెనీలు కాస్ట్ క‌టింగ్ కు తెర తీశాయి. ఇక దిగ్గ‌జ ఐటీ కంపెనీలు అయితే ఉన్న‌ట్టుండి ముఖం చాటేస్తున్నాయి. లేఆఫ్స్ ప్ర‌క‌టించేందుకు సిద్దంగా ఉన్నాయి.

వాటిలో గూగుల్, మైక్రో సాఫ్ట్ , ఫేస్ బుక్ , అమెజాన్ , టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, క్యాప్ జెమిని, పొలారిస్ , త‌దిత‌ర కంపెనీలు కొత్త వారిని తీసుకునేందుకు

సుముఖ‌త చూప‌డం లేదు. దిగ్గ‌జ సంస్థ‌లు, వ్యాపార‌వేత్త‌ల‌కు ఇప్పుడు ఒక బూచీ దొరికింది. అదేమిటంటే ర‌ష్యా ఉక్రెయిన్ యుద్దం. ప్ర‌తి స‌మ‌స్య‌కు

దానితో ముడి పెట్ట‌డం అల‌వాటుగా మారింది.

ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ప్ర‌పంచ మార్కెట్ ఒక్క‌సారిగా కుదుపున‌కు లోన‌వుతోంది. మ‌రో వైపు చైనా చాప‌కింద నీరులా విస్త‌రిస్తోంది. దీనిని చూసి పెద్ద‌న్న

అమెరికా భ‌య‌ప‌డుతోంది. ఈ త‌రుణంలో మ‌రోసారి ఎలాన్ మ‌స్క్ గురించి ప్ర‌స్తావించాల్సి వ‌స్తోంది. ఎందుకంటే క‌నీసం టైం ఇవ్వ‌కుండా ఉద్యోగుల‌ను

సాగ‌నంప‌డం అనేది మంచిప‌ద్ద‌తి కాదు.

ఇందుకు సంబంధించి ముంద‌స్తుగానే టాప్ టీంల‌ను తొల‌గించాడు. 50 శాతానికి పైగా ఉద్యోగుల‌ను తొల‌గిస్తున్న‌ట్లు ఇమెయిల్స్ ద్వారా పంపించాడు.

ఇలాంటి చ‌ర్య‌ల వ‌ల్ల దానిపై ఆధార‌ప‌డి బ‌తికే ఉద్యోగుల ప‌రిస్థితి ఏమిట‌నేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. మ‌స్క అనుస‌రించిన ఈ ధోర‌ణి రేపు అన్ని కంపెనీల‌పై ప‌డ‌ద‌న్న గ్యారెంటీ ఏమిటి.

అదే కోట్లాది మందిని తొలుస్త‌న్న ప్ర‌శ్న‌. అమెరికా లాంటి దేశాలు క‌ఠిన‌త‌ర‌మైన కార్మిక‌, ఉద్యోగాల‌కు సంబంధించి రూల్స్ చేయాల్సిన అవ‌స‌రం ఉంది.

ఏ కార‌ణం లేకుండా తొల‌గించే ప‌ద్ద‌తికి స్వ‌స్తి ప‌లికేలా చూడాలి. లేక పోతే ప్ర‌తి చోటా లే ఆఫ్స్ ద‌ర్శ‌న‌మిస్తాయి. త‌స్మాత్ జాగ్ర‌త్త‌. ఎలాన్ మ‌స్క్ ప్ర‌పంచానికి ఓ పాఠం కావాలి. అది గుర్తిస్తే బెట‌ర్.

Also Read : ఎలాన్ మ‌స్క్ పై జో బైడ‌న్ క‌న్నెర్ర‌

Leave A Reply

Your Email Id will not be published!