Elon Musk : ఎలోన్ మస్క్ డైలమా ట్విట్టర్ షేర్లపై ఎఫెక్ట్
కొలిక్కి రాని కొనుగోలు ఒప్పందం
Elon Musk : ప్రపంచ కుబేరుడు, టెస్లా సిఇఓ, చైర్మన్ ఎలోన్ మస్క్(Elon Musk) రోజుకో ట్వీట్ చేస్తూ సంచలనానికి తెర లేపారు. కానీ ఇప్పటి వరకు మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్టర్ కొనుగోలు విషయంలో మస్క ఇంకా సందిగ్దంలోనే ఉన్నారు.
ఎటూ తేల్చుకోలేక పోతున్నారు. ఓ వైపు రోజు రోజుకు ట్వీట్లతో హోరెత్తిస్తున్న ఎలోన్ మస్క్ ఇప్పటి దాకా ట్విట్టర్ ను $44 బిలియన్ల ఒప్పందం కంటిన్యూ చేస్తాడా లేదా అన్నది సందేహంగా ఉంది.
దీంతో మస్క్ దెబ్బకు ట్విట్టర్ సంస్థ షేర్లు కిందకు దిగజారుతున్నాయి. మరో వైపు సిఇఓ గా ఉన్న ప్రవాస భారతీయుడు పరాగ్ అగర్వాల్ పై లేనిపోని కామెంట్స్ చేస్తూ వస్తుండడం కూడా కొంత ఇబ్బందికరంగా మారింది.
ఒకవేళ తాను కొనుగోలు చేయనట్లయితే ఎలోన్ మస్క్ భారీ ఎత్తున ట్విట్టర్ కు చెల్లించాల్సి ఉంటుంది. ఒక రకంగా తీవ్ర నష్టమే. ఒక్క రూపాయి కూడా వేస్ట్ చేయడానికి ఇష్ట పడని ఎలోన్ మస్క్(Elon Musk) ట్విట్టర్ కు తానే డబ్బులు ఇస్తాడని అనుకోవడం భ్రమే అవుతుంది.
కానీ సస్పెన్స్ కొనసాగిస్తూనే వస్తున్న మస్క్ తుది నిర్ణయం తీసుకునేంత దాకా అటు ఉద్యోగులు, ఇటు సిబ్బంది , చీఫ్ తో పాటు అంతా లోలోపట మధన పడుతున్నారు.
ఇందుకు సంబంధించి సోషల్ మీడియా దిగ్గజమైన ట్విట్టర్ ను కొనుగోలు చేసేందుకు ఎలోన్ మస్క్ డీల్ ప్రమాదంలో పడిందంటూ వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది. దీంతో ఈ కథనం దెబ్బకు ట్విట్టర్ షేర్లు కొంత మేరకు పడి పోయాయి.
Also Read : గగన వీధిలో ‘ఆకాశ ఎయిర్ లైన్స్’ కు ఓకే