Elon Musk : లైంగిక ఆరోపణలపై ఎలోన్ మస్క్ ఫైర్
ఎలాంటి ఛాలెంజ్ కైనా సిద్దమని ప్రకటన
Elon Musk : టెస్లా సిఇఓ, చైర్మన్ ఎలోన్ మస్క్ నిత్యం వార్తల్లో ఉంటున్నారు. ఆయన ఎప్పుడైతే ట్విట్టర్ ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించాడో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి.
ఈ కొనుగోలు వెనుక మాజీ చీఫ్ డొనాల్డ్ ట్రంప్ కూడా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదే సమయంలో $44 బిలియన్ల డాలర్లకు కొనుగోలు చేస్తున్నానని ప్రకటించిన ఎలోన్ మస్క్ మరో మెలిక పెట్టాడు.
స్పామ్ ఖాతాలు ఎన్ని ఉన్నాయో తెలిపితేనే తాను డీల్ కుదుర్చుకుంటానని లేక పోతే తప్పుకుంటానని హెచ్చరించాడు. ఎలోన్ మస్క్(Elon Musk) చేసిన హెచ్చరికను పట్టించు కోలేదు ట్విట్టర్ సిఇఓ పరాగ్ అగర్వాల్. ముందు నుంచీ వీరిద్దరికీ పడడం లేదు.
ఇది ఓ వైపు ఇలా ఉంటే మరో వైపు ఎలోన్ మస్క్(Elon Musk) పై లైంగిక ఆరోపణలు వచ్చాయని, ఆయన గుట్టు చప్పుడు కాకుండా డబ్బులు కూడా పరిహారంగా ఇచ్చాడంటూ ప్రముఖ పత్రిక బిజినెస్ ఇన్ సైడర్ ప్రత్యేక కథనం వెలువరించింది.
దీంతో ఈ కథనం ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపింది. పేరు లేని ప్రైవేట్ జెట్ ఫ్లైట్ అటెండెంట్ నుండి లైంగిక వేధింపుల దావాను పరిష్కరించేందుకు మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ 2018లో $2,50,000 డాలర్లు చెల్లించందంటూ నివేదించింది.
ఇదంతా పూర్తిగా అబద్దం అంటూ మస్క్ ట్విట్టర్ వేదికగా తెలిపాడు. తాను తప్పుగా ప్రవర్తించ లదేని పేర్కొన్నాడు. ఇదంతా కావాలని తన పరువుకు భంగం కలిగించేందుకు చేస్తున్న ప్రయత్నంగా ఆయన కొట్టి పారేశాడు . మస్క్ పై ఆరోపణలు కలకం రేపాయి.
Also Read : మరింత క్షీణించిన రూపాయి విలువ