Elon Musk Twitter : ప్రపంచ కుబేరుడు. విద్యుత్ కార్ల టెస్లా తయారీదారు, సంస్థ ఫౌండర్ కమ్ చైర్మన్ ఎలన్ మస్క్ (Elon Musk Twitter)రోజుకో నిర్ణయంతో ప్రపంచాన్ని విస్తు పోయేలా చేస్తున్నాడు. మనోడి దృష్టి నింగిపై పడింది.
అక్కడ కూడా తన వ్యాపారాన్ని మొదలు పెట్టాడు. ఇప్పటికే ఉపగ్రహాల ద్వారా ఇంటర్నెట్ కనెక్టివిటీని కలిగించాలన్నది ఆయన కోరిక. దానికి అనుగుణంగా మనోడు ప్లాన్ చేశాడు.
ప్రస్తుతం తీవ్ర చర్చకు దారి తీస్తున్న క్రిప్టో కరెన్సీ పై కూడా ఉత్సుకత చూపించాడు. దీంతో దాని షేర్లు అమాంతం పెరిగాయి. తాజాగా ప్రపంచాన్ని విస్తు పోయేలా చేస్తున్న ట్విట్టర్ పై ఫోకస్ పెట్టాడు.
ఇటీవల అమెరికా స్టాక్ మార్కెట్ ఎక్స్చేంజ్ లో లిస్టింగ్ సమర్పించిన నివేదికలో ఏకంగా ట్విట్టర్ కంపెనీలో 9.2 శాతం షేర్లు కొనుగోలు చేశాడని స్పష్టం చేసింది.
దీంతో దీని విలువ రూ. 300 కోట్ల డాలర్లు అన్నమాట. ఈ విషయాన్ని ట్విట్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పరాగ్ అగర్వాల్ వెల్లడించారు.
అంతే కాకుండా ఎలన్ మస్క్ వచ్చే 2024 సంవత్సరం దాకా సంస్థకు సంబంధించి క్లాస్ టూ డైరెక్టర్ గా కొనసాతాడని స్పష్టం చేశాడు సిఇఓ.
ఆయనను తమ సంస్థలోకి స్వాగతిస్తున్నట్లు తెలిపాడు. బోర్డులో ఉండడం వల్ల ట్విట్టర్ కు అదనపు ఆకర్షణ కలుగుతుందని పేర్కొన్నాడు పరాగ్ అగర్వాల్.
త్వరలో గణనీయమైన మార్పులు తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తామని స్పష్టం చేశాడు. అయితే ఇందుకు రిప్లై కూడా ఇచ్చాడు మస్క్.
Also Read : ఇన్వెస్టర్లకు స్వర్గధామం తెలంగాణ