Elon Musk SVB : సిలికాన్ వ్యాలీ బ్యాంక్ టేకోవర్ కు ఓకే
రేజర్ సిఇఓ ప్రతిపాదనకు ఎలోన్ మస్క్
Elon Musk SVB : ఆర్థిక సంక్షోభం కారణంగా అమెరికాలో కీలకమైన పాత్ర పోషిస్తూ వచ్చిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ను మూసి వేస్తున్నట్లు ప్రకటించారు. ఇది ఒక రకంగా బిగ్ షాక్. ఈ సందర్బంగా బ్యాంక్ ను కొనుగోలు చేయాలని ట్విట్టర్ సిఇఓ ఎలోన్ మస్క్(Elon Musk SVB) కోరుతూ రేజర్ సిఇఓ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. దీనిపై వెంటనే స్పందించారు ఎలోన్ మస్క్. దీని గురించి ఆలోచిస్తానని పేర్కొన్నాడు. ఇప్పటికే ఆయన ట్విట్టర్ ను రూ. 4,400 కోట్లకు కొనుగోలు చేశాడు.
సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కొనుగోలు చేయాలా వద్దా అన్న దానిపై ఆలోచిస్తానని పేర్కొన్నాడు. ఎస్వీబీ స్టాక్ ధర 60 శాతం క్షీణించిన ఒక రోజు తర్వాత రెగ్యులేటర్లతో మూసి వేశారు. దాని ఆస్తులన్నంటిని స్వాధీనం చేసుకున్నట్లు ఫెడరల్ రిజర్వ్ ఏజెన్సీ. 2008 నుండి విఫలమైన అతి పెద్ద రిటైల్ బ్యాంక్ గా మారింది. ఈ చర్య ప్రపంచ మార్కెట్ లను కుదిపేసింది. కంపెనీలు, పెట్టుబడిదారులకు చెందిన బిలియన్ల డాలర్లను పోగొట్టుకుంది.
సిలికాన్ వ్యాలీ బ్యాంకు డిపాజిట్లతో పోరాడుతోందని , అవసరమైన నగదును సేకరించేందుకు స్టాక్ ఆఫర్ , ఆఫ్ లోడ్ చేసిన సెక్యూరిటీలను ప్రకటించింది. ఈ ఒక్క ప్రకటన తర్వాత న్యూయార్క్ లో 60 శాతం కుప్ప కూలాయి. రెగ్యులేటర్లు బ్యాంకును మూసి వేసినట్లు ప్రకటించే ముందు ట్రేడింగ్ నిలిపి వేశారు.
ఈ మొత్తం వ్యవహారంలో ట్విట్టర్ సిఇఓ ఎలోన్ మస్క్(Elon Musk SVB) చేసిన కామెంట్స్ కీలకంగా మారాయి. సిలికాన్ వాలీ బ్యాంక్ కాలిఫోర్నియా , మసాచుసెట్స్ లో 17 శాఖలతో యుఎస్ లో 16వ అతి పెద్ద బ్యాంకుగా ఉంది.
Also Read : హెచ్‌యుఎల్ చీఫ్ గా రోహిత్ జావా