Elon Musk : ప్రపంచ కుబేరుడిగా పేరొందిన ఎలోన్ మస్క్ ఆలోచనా తీరు వేరుగా ఉంటుంది. ఆయన మిగతా వ్యాపార వేత్తలకంటే భిన్నంగా ఆలోచిస్తారు. అందుకే ఆయన టాప్ లో ఉన్నారు. మిగతా వాళ్లు నేల చూపులు చూస్తున్నారు.
ఇటీవలే ఆయన మైక్రో బ్లాగింట్ సంస్థ ట్విట్టర్ లో 9.2 శాతం షేర్లు కొనుగోలు చేశారు. దీని విలువ దాదాపు రూ. 300 కోట్లకు పై మాటే. ఆయన అనధికారికంగా ట్విట్టర్ సంస్థలో బోర్డు మెంబర్ గా కొనసాగుతారు.
ఈ తరుణంలో ఉన్నట్టుండి ఎలోన్ మస్క్ గురువారం ఆసక్తికర ప్రకటన చేశాడు. తాను ట్విట్టర్ ను కొనుగోలు చేస్తానని, మొత్తం తనకు ఇవ్వాలని కోరాడు.
ఇందుకు సంబంధించి 41 బిలయన్లను వెచ్చించేందుకు రెడీగా ఉన్నానని ట్విట్టర్ సిఇఓ, చైర్మన్లకు ఆఫర్ ఇచ్చాడు ఎలోన్ మస్క్(Elon Musk). ఇక రెల్యులేటరీ ఫైలింగ్ లో ఈ విషయాన్ని వెల్లడించాడు.
ఆఫర్ ధర ఒక్కో షేరుకు 54.20 గా ఉంది. ఏప్రిల్ 1 తో ముగిసే నాటికి 38 శాతం ప్రీమియంను సూచిస్తుంది. అయితే తాను అనధికార బోర్డు మెంబర్ గా ఉండేందుకు తిరస్కరించాడు.
కానీ అంతలోనే మెలిక పెట్టాడు. తాను పూర్తిగా కొనుగోలు చేసేందుకు రెడీగా ఉన్నానంటూ బంపర్ ఆఫర్ ప్రకటించాడు. టెస్లా సిఇఓ 9 శాతం కంటే ఎక్కువ వాటాను పబ్లిక్ గా మార్చేందుకు చివరి ట్రేడింగ్ రోజు.
తాను కంపెనీలో పెట్టుబడి పెట్టినప్పటి నుంచి కంపెనీ అభివృద్ది చెందిందని గమనించాఉ. ట్విట్టర్ ను ప్రైవేట్ కంపెనీగా మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
Also Read : మైక్రోసాఫ్ట్ సిఇఓ సంచలన కామెంట్స్