Elon Musk City : స్వంత ప‌ట్ట‌ణ నిర్మాణంపై మ‌స్క్ ఫోక‌స్

ఇందులో త‌న‌తో పాటు ఎంప్లాయిస్ కూడా

Elon Musk City : టెస్లా చైర్మ‌న్ , ట్విట్ట‌ర్ బాస్ ఎలోన్ మ‌స్క్ ఏది చేసినా సంచ‌ల‌న‌మే. ఎందుకంటే ఆయ‌న ఏది మాట్లాడినా లేదా ఏదైనా ట్వీట్ చేసినా దానికి ప్ర‌పంచ వ్యాప్తంగా ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. ఆ వెంట‌నే ల‌క్ష‌ల్లో లైక్ లు, వ్యూస్ కూడా వ‌స్తాయి.

ఇది ఆయ‌న ప్ర‌త్యేక‌త‌. ప్ర‌పంచ కుబేరుల జాబితాల్లో త‌ను ఉన్నా ఏనాడూ ల‌గ్జ‌రీయిస్ లైఫ్ ను కోరుకోడు. ఇది ఆయ‌న స్పెషాలిటీ. అత‌డేదో అమాయ‌కుడ‌ని అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే. ఎందుకంటే ఇప్ప‌టికే భ‌విష్య‌త్తులో ఏం జ‌రగ బోతోందో, దేనికి ఎంత మార్కెట్ ఉంటుందో అనే విష‌యంపై ప్లాన్ చేసే ప‌నిలో ఉన్నాడు మ‌స్క్(Elon Musk City).

ఇప్ప‌టికే విద్యుత్ కార్ల తయారీలో నెంబ‌ర్ వ‌న్ కంపెనీగా ఉంది టెస్లా. ఇక ట్విట్ట‌ర్ ను గాడిలో పెట్టేందుకు ఫోక‌స్ పెట్టాడు. మ‌రో వైపు సుదీర్ఘ చ‌రిత్ర క‌లిగిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ను కొనుగోలు చేసే ఆలోచ‌న‌లో ప‌డ్డాడు. ఇదిలా ఉండ‌గానే సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు. అదేమిటంటే త‌న‌కంటూ ఓ స్వంత ప‌ట్ట‌ణాన్ని నిర్మించాల‌ని ప్లాన్ చేస్తున్నాడు. ఈ ప్లాన్ లో 100 కంటే ఎక్కువ ఇళ్ల‌ను నిర్మించ‌డం. వీటిలో స్విమ్మింగ్ పూల్ , అవుట్ డోర్ స్పోర్ట్స్ ఏరియా త‌దిర ఫీచ‌ర్స్ కూడా ఉన్న‌ట్లు స‌మాచారం.

బిలియ‌నీర్ ఉద్యోగులు నివ‌సించే , ప‌ని చేసే ప‌ట్ట‌ణాన్ని ప్రారంభించేందుకు ఎలోన్ మ‌స్క్(Elon Musk) , ఆయనకు చెందిన సంస్థ‌లు టెక్సాస్ లో వేల ఎక‌రాల భూమిని కొనుగోలు చేస్తున్నాయ‌ని వాల్ స్ట్రీట్ జ‌న‌ర‌ల్ వెల్ల‌డించింది. క‌నీసం 3,500 ఎక‌రాలు కొనుగోలు చేశాడ‌ని స‌మాచారం.

Also Read : సిలికాన్ వ్యాలీ బ్యాంక్ టేకోవ‌ర్ కు ఓకే

Leave A Reply

Your Email Id will not be published!