Emerging Player Jaiswal : ఎమర్జింగ్ ప్లేయర్ గా జైస్వాల్
21 ఏళ్లు 14 మ్యాచ్ లు 625 రన్స్
Emerging Player Jaiswal : ఐపీఎల్ 16వ సీజన్ ముగిసింది. ధోనీ సేన ఛాంపియన్ గా నిలిచింది. ఇక అత్యుత్తమ ఆటగాళ్లు, జట్లకు సంబంధించి అవార్డులు ప్రకటించింది ఐపీఎల్ కమిటీ. ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా శుభ్ మన్ గిల్, పర్పుల్ క్యాప్ విన్నర్ గా మహమ్మద్ షమీ ఎన్నికయ్యారు.
ఇక రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ గా ఉన్న యంగ్ క్రికెటర్ యశస్వి జైస్వాల్(Jaiswal) ను ఎంపిక చేసింది. 21 ఏళ్లు కలిగిన యశస్వి జైస్వాల్ స్వస్థలం యూపీ. బతుకు దెరువు కోసం తండ్రి ముంబైకి వచ్చాడు. పానీ పూరీ అమ్మాడు. తండ్రికి చేదోడుగా ఉన్నాడు. కానీ క్రికెట్ మీద ఉన్న ఆశతో అతడిని అద్భుతమైన ఆటగాడిగా మారేలా చేసింది. ఈసారి ఐపీఎల్ సీజన్ లో దుమ్ము రేపాడు. సెంచరీతో కదం తొక్కాడు. 5 హాఫ్ సెంచరీలతో రెచ్చి పోయాడు.
మొత్తం 14 మ్యాచ్ లు ఆడాడు యశస్వి జైస్వాల్. ఇందులో 625 రన్స్ ఉన్నాయి. శుభ్ మన్ గిల్ ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపించాడు. ఆ జట్టులో జోస్ బట్లర్ మొదట్లో రాణించినా ఆ తర్వాత ఆశించిన మేర ఆడలేక పోయాడు. ఇక సంజూ శాంసన్ సరైన సమయంలో చేతులెత్తేశాడు. షిమ్రోన్ హిట్మెయర్ పర్వాలేదని పించాడు. ప్రైజ్ మనీ కింద రూ. 10 లక్షలు అందజేసింది ఐపీఎల్ కమిటీ.
Also Read : Shami Purple Cap Winner