Enforcement Directorate: బెంగాల్‌ సిఎం మమతా పై కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

బెంగాల్‌ సిఎం మమతా పై కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

Enforcement Directorate: రేషన్ పంపిణీ కుంభకోణం కేసులో సోదాలు నిర్వహించడానికి వెళ్ళిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ED) అధికారులపై పశ్చిమ బెంగాల్‌ లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు దాడులు చేయడంపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఆగ్రహం తీవ్ర వ్యక్తం చేసారు. ప్రభుత్వ అధికారులపై ఓ పార్టీకు చెందిన అనుచరులు గూండాలు మాదిరీగా దాడులు చేయడంపై గిరిరాజ్ సింగ్ అసహనం వ్యక్తం చేస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘‘పశ్చిమ బెంగాల్‌లో ప్రజాస్వామ్యం కనిపించడం లేదు. ఉత్తర కొరియాలోని కిమ్‌ తరహా ప్రభుత్వాన్ని మమతా బెనర్జీ రాష్ట్రంలో నడిపిస్తున్నారు. రాష్ట్రంలో హత్యలు జరిగినా కొత్త విషయం కాదని కాంగ్రెస్‌ ఎంపీ అధీర్‌ రంజన్‌ కూడా అంటున్నారు. ఇదేనా మమత ప్రజాస్వామ్య ప్రభుత్వం’’ అంటూ కేంద్రమంత్రి గిరిరాజ్‌ సింగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్‌ చేసారు. మరోవైపు అరాచకానికి అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని గవర్నర్‌ సీవీ ఆనంద బోస్‌ పేర్కొన్నారు.

Enforcement Directorate – ఈడీ అధికారులపై టిఎంసి కార్యకర్తల దాడి

రేషన్‌ పంపిణీ కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా శుక్రవారం ఈడీ అధికారులు సందేశ్‌ఖలిలోని టీఎంసీ నేత షేక్‌ షాజహాన్‌ ఇంట్లో సోదాలు జరుపుతున్నారు. దీనితో అక్కడికి చేరుకున్న వందలాది మంది షాజహాన్‌ మద్దతుదారులు రెచ్చిపోయి మారణాయుధాలతో ఈడీ అధికారులపై దాడికి తెగబడ్డారు. ఈ సోదాలను కవర్ చేయడానికి వెళ్ళిన మీడియా సిబ్బందిపై కూడా దాడి చేసారు. దాడిలో పలువురు ఈడీ అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. షాజహాన్‌ అనుచరులు అధికారుల వాహనాల్ని కూడా వదలకుండా ధ్వంసం చేశారు. రక్షణగా వచ్చిన కేంద్ర పారా మిలటరీ బలగాలపైనా దాడికి దిగారు. దీనితో గాయపడిన ఈడీ అధికారులు ఆటోలు, ద్విచక్ర వాహనాల్లో అక్కడి నుంచి బయటపడ్డారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు అధికారులకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Also Read : Aditya L1 Journey : దివి కక్ష్యలోకి విజయవంతంగా పంపిన ఇస్రో – ఆదిత్య L-1

Leave A Reply

Your Email Id will not be published!