ENG vs IRE T20 World Cup : ఇంగ్లండ్ కు ఐర్లాండ్ బిగ్ షాక్
డక్ వర్త్ లూయిస్ తో గెలుపు
ENG vs IRE T20 World Cup : ఆస్ట్రేలియా వేదికగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20 వరల్డ్ కప్ -2022లో జరిగిన కీలక మ్యాచ్ లో ఇంగ్లండ్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది ఐర్లాండ్ . ఇప్పటికే సంచలన విజయాలు నమోదవుతున్నాయి. డక్ వర్త్ లూయిస్ పద్దతిన గెలుపొందింది ఐర్లాండ్.
2010లో వరల్డ్ ఛాంపియన్ గా నిలిచిన ఇంగ్లండ్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది. వర్షం కారణంగా మ్యాచ్ కు అంతరాయం కలిగింది. దీంతో 5 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది ఐర్లాండ్(ENG vs IRE T20 World Cup).
ఇక మ్యాచ్ లో భాగంగా మొదట బ్యాటించ్ చేసింది ఐర్లాండ్. నిర్ణీత 20 ఓవర్లలో 157 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన ఇంగ్లండ్ 158 పరుగల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వర్షం అడ్డంకిగా మారింది. ఎప్పటి లాగే డక్ వర్త్ లూయిస్ ను అమలు చేశారు అంపైర్లు. 14.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్ కేవలం 105 పరుగులు చేసింది.
ఇదే క్రమంలో వర్షం పడటంతో ఆట నిలిపి వేశారు. ఆ సమయానికి మొయిన్ అలీ 24 పరుగులతో , లియామ్ లివింగ్ స్టోన్ ఒక్క పరుగుతో క్రీజులో ఉన్నారు. చివరకు ఆట తిరిగి ప్రారంభం అయ్యే ఛాన్స్ లేక పోవడంతో ఐర్లాండ్ ను గెలిచినట్లు ప్రకటించారు.
ఒక రకంగా టి20 వరల్డ్ కప్ లో టైటిల్ ఫెవరేట్ గా ఉన్న జట్లలో ఇంగ్లండ్ ఒకటి. ప్రస్తుతం ఐర్లాండ్ ఇచ్చిన షాక్ తో ఇంగ్లండ్ కు కోలుకోలేని షాక్ తగిలింది. ఇదిలా ఉండగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. భారత్ , నెదర్లాండ్ మధ్య లీగ్ మ్యాచ్ కొనసాగనుంది.
Also Read : ఐసీసీ టాప్ 10లో విరాట్ సూర్య..కోహ్లీ