ENG vs NZ T20 World Cup : బ‌ట్ల‌ర్..అలెక్స్ జోష్ కీవీస్ కు షాక్

20 ప‌రుగుల తేడాతో ప‌రాజ‌యం

ENG vs NZ T20 World Cup : ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రుగుతున్న ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఇవాళ రెండు మ్యాచ్ లు జ‌రిగాయి. శ్రీ‌లంక ఆరు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ పై ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. డూ ఆర్ డై ప‌రిస్థితుల్లో లంకేయులు స‌త్తా చాటారు. ప్ర‌ధానంగా ధ‌నంజ‌య డిసిల్వ అద్భుతంగా ఆడాడు. 66 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

జాబితాలో మూడో ప్లేస్ లో నిలిచింది శ్రీ‌లంక‌. ఇదే స‌మ‌యంలో మ‌రో కీల‌క మ్యాచ్ లో న్యూజిలాండ్ పై ఇంగ్లండ్ స‌త్తా(ENG vs NZ T20 World Cup) చాటింది. అద్భుత‌మైన ఆట తీరుతో ఆక‌ట్టుకుంది. 20 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. మ్యాచ్ లో భాగంగా మందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి 179 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది.

స్టార్ హిట్ట‌ర్ గా పేరొందిన జోస్ బ‌ట్ల‌ర్ , అలెక్స్ హేల్స్ హాఫ్ హాఫ్ సెంచ‌రీల‌తో చెల‌రేగ‌డంతో కీవీస్ ముందు 180 ప‌రుగుల టార్గెట్ ముందుంచింది. న్యూజిలాండ్ బౌల‌ర్ల‌లో లూకీ ఫెర్గుసన్ రెండు వికెట్లు తీస్తే టీమ్ సౌథీ, సాంట్న‌ర్ , ఇష్ సోదీ చెరో వికెట్ తీశారు. అనంత‌రం భారీ టార్గెట్ ఛేద‌నలో బ‌రిలోకి దిగిన న్యూజిలాండ్ కేవ‌లం 159 ప‌రుగులకే ప‌రిమిత‌మైంది.

కేన్ విలియ‌మ్స‌న్ 40 ర‌న్స్ చేస్తే ఫిలిప్స్ సూప‌ర్ ఇన్నింగ్స్ తో ఆక‌ట్టుకున్నాడు. 62 ప‌రుగులు చేసినా ఫ‌లితం లేక పోయింది. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో వోక్స్ , సామ్ క‌ర‌న్ చెరో రెండు వికెట్లు తీయ‌గా మార్క్ వుడ్ , బెన్ స్టోక్స్ చెరో వికెట్ ప‌డ‌గొట్టారు. దీంతో ఇంగ్లండ్ సెమీస్ ఆశ‌లు సజీవంగా ఉన్నాయి.

Also Read : ఆఫ్గ‌నిస్తాన్ పై శ్రీ‌లంక గ్రాండ్ విక్ట‌రీ

Leave A Reply

Your Email Id will not be published!