ENG vs PAK 1st Test : మొదటి టెస్టులో పాక్ పై ఇంగ్లండ్ విక్టరీ
ఇన్నింగ్స్ 74 రన్స్ తో ఘన విజయం
ENG vs PAK 1st Test : స్వదేశంలో బాబర్ ఆజమ్ సారథ్యంలోని పాకిస్తాన్ జట్టుకు కోలుకోలేని షాక్ తగిలింది. ఇంగ్లండ్ జట్టు అద్బుతమైన ఆట తీరును కనబర్చింది. ఏకంగా 74 పరుగుల తేడాతో మొదటి టెస్టులో ఘన విజయాన్ని నమోదు చేసింది. రావల్పిండిలో జరిగిన మొదటి టెస్టులో ఇంగ్లండ్ జట్టు ఆటగాళ్లు అన్ని విభాగాలలో రాణించారు. సత్తా చాటారు.
దీంతో మూడు టెస్టుల సీరీస్ లో ఇంగ్లండ్ 1-0తో ఆధిక్యంలో కొనసాగుతోంది. మరో వైపు పాకిస్తాన్ కూడా డ్రా చేసుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నం చేసింది. కానీ ఊహించని రీతిలో ఇంగ్లండ్(ENG vs PAK 1st Test) బౌలర్లు చుక్కలు చూపించారు పాకిస్తాన్ బ్యాటర్లకు. పాకిస్తాన్ క్రికెటర్లతో పాటు ఫ్యాన్స్ కూడా డ్రాగా ముగుస్తుందని ఆశించారు.
కానీ ఇంగ్లండ్ బౌలర్లు తిప్పేశారు. పాక్ ప్లేయర్లకు కోలుకోలేని షాక్ ఇచ్చారు. ఇక పాకిస్తాన్ కు చెందిన బ్యాటర్లు ఒకరి వెంట మరొకరు పెవిలియన్ దారి పట్టినా సాద్ షకీల్ ఒక్కడే రాణించాడు. ఇంగ్లండ్ విజయానికి అడ్డంకిగా నిలిచాడు. కానీ చేసిన ప్రయత్నం ఏ మాత్రం ఫలించలేదు. 74 రన్స్ చేశాడు షకీల్.
ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ 48 పరుగులకే అవుట్ అయ్యాడు. మిగతా ప్లేయర్లు ఎవరూ తట్టుకోలేక పోయారు బౌలర్లను. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ , ఓలీ రాబిన్సన్ రెచ్చి పోయారు. అద్భుతమైన బంతులతో చెరో నాలుగు వికెట్లు తీశారు. తమ జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించారు.
ఇదిలా ఉండగా రెండో ఇన్నింగ్స్ ఆడిన ఇంగ్లండ్ 7 వికెట్లు కోల్పోయి 264 రన్స్ చేసింది. జాక్ రూట్ 73 రన్స్ చేస్తే బ్రూక్ 87 పరుగులు చేశాడు.
Also Read : స్టార్లున్నా అందని సక్సెస్