ENG vs SL ICC World Cup : అబ్బా లంకేయుల దెబ్బ
వరల్డ్ కప్ నుంచి ఇంగ్లండ్ ఔట్
ENG vs SL ICC World Cup : చెన్నై – గతంలో ఐసీసీ(ICC) వన్డే వరల్డ్ కప్ ఛాంపియన్ గా ఉన్న ఇంగ్లండ్ జట్టు ఈసారి భారత్ లో జరుగుతున్న వరల్డ్ కప్ 2023 నుండి నిర్దాక్షిణ్యంగా నిష్క్రమించింది. పసికూనలుగా భావించిన లంకేయుల చేతిలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇది ఇంగ్లండ్ జట్టేనన్న అనుమానం కలిగింది అభిమానులకు.
ENG vs SL ICC World Cup Updates
దీంతో సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది ఇంగ్లండ్ . చెన్నైలోని చిన్న స్వామి మైదానం వేదికగా జరిగిన కీలక పోరులో ఏ మాత్రం పోరాట పటిమ ప్రదర్శించింది. విచిత్రం ఏమిటంటే ఇంగ్లండ్ జట్టుకు ఇది వరుసగా నాలుగో పరాజయం కావడం విస్తు పోయేలా చేసింది.
ఈ టోర్నీలో ఆఫ్గనిస్తాన్ చేతిలో ఇంగ్లండ్ ఓడి పోయింది. తాజాగా శ్రీలంకతో నువ్వా నేనా అన్న రీతిలో ఆడాల్సిన ఇంగ్లండ్ చేతులెత్తేసింది. కెప్టెన్ బట్లర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 156 పరుగులకే కుప్ప కూలింది. శ్రీలంక బౌలర్లు చెలరేగారు. ఇంగ్లండ్ ప్లేయర్లను కట్టడి చేశారు.
ఆ తర్వాత తక్కువ టార్గెట్ ను కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి గ్రాండ్ విక్టరీ నమోదు చేశారు. ఏకంగా 8 వికెట్ల తేడాతో చుక్కలు చూపించారు ప్రత్యర్థి జట్టుకు. ఇంగ్లండ్ జట్టులో బెన్ స్టోక్స్ 43 , బెయిర్ స్టో 30, మలాన్ 28 మాత్రమే ఆడారు. మిగతా ఆటగాళ్లు రాణించ లేక పోయారు.
ఇక లంక బౌలర్లలో కుమార 3, మాథ్యుస్ , రజిత చెరో 2 వికెట్లు తీశారు. లంక జట్టులో నిషాంక చెలరేగాడు . 77 రన్స్ చేస్తే సమర విక్రమ 65 రన్స్ తో రాణించాడు.
Also Read : Chamundeshwara Nath : ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ లో చాముండి