Micheal Hussey : ఇంగ్లాండ్ దే టి20 వరల్డ్ కప్ – హస్సీ
కోచ్ మైఖేల్ హస్సీ షాకింగ్ కామెంట్స్
Micheal Hussey : ఆస్ట్రేలియా వేదికగా ఐసీసీ టి20 వరల్డ్ కప్ మెగా ఈవెంట్ ప్రారంభం కానుంది. ఇప్పటకే 16 జట్లు చేరుకున్నాయి. ప్రారంభ మ్యాచ్ నమీబియాతో శ్రీలంక ఆడనుంది. దీంతో టోర్నీ అధికారికంగా ప్రారంభం కానుంది. మరో వైపు తాజా, మాజీ ఆటగాళ్లు ఏ జట్లు వరల్డ్ కప్ ను అందుకుంటాయనే దానిపై అంచనాలు వేస్తున్నారు.
ఆసియా కప్ లో ఊహించని రీతిలో శ్రీలంక పాకిస్తాన్ కు షాక్ ఇచ్చింది. విజేతగా నిలిచింది. ఈ తరుణంలో ఈసారి బలమైన జట్లలో భారత్, పాకిస్తాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లలో ఇంగ్లండ్ సత్తా చాటింది. ఆసిస్ కు చుక్కలు చూపించింది.
ఇప్పటికే ఆసిస్ డిఫెండింగ్ ఛాంపియన్ గా ఉంది. ఈసారి తమ హోం గ్రౌండ్ లో ఆడుతుండడంతో ఎక్కువగా గెలిచేందుకు అవకాశం ఉందని మాజీ క్రికెటర్లు అభిప్రాయ పడుతున్నారు. మరో వైపు ఇండియాను తక్కువగా అంచనా వేసేందుకు వీలు లేదంటున్నారు. ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా ఇంగ్లండ్ ను ఈసారి ఏ జట్టు ఆపలేదని కుండ బద్దలు కొట్టారు ఆ జట్టు కోచ్ మైఖేల్ హస్సీ(Micheal Hussey).
తమ జట్టు అన్ని విభాగాలలో సత్తా చాటుతోందని దానికి తిరుగు లేదంటున్నాడు. ఇదిలా ఉండగా తన 50వ టి20 మ్యాచ్ ఆడబోతున్న డేవిడ్ మలాన్ కు ప్రత్యేక క్యాప్ ను బహూకరించాడు. ఈ సందర్బంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ, బాబర్ ఆజమ్ కంటే మిలాన్ బెటర్ అన్నాడు.
Also Read : ఒకే ఫ్రేమ్ లో 16 మంది కెప్టెన్లు