IND vs ENG 5th Test : ఇంగ్లండ్ సెన్సేష‌న్ విక్ట‌రీ సీరీస్ స‌మం

7 వికెట్ల తేడాతో భార‌త్ పై ఘ‌న విజ‌యం

IND vs ENG 5th Test : రీ షెడ్యూల్ ఐదో టెస్టు మ్యాచ్ లో ఊహించ‌ని రీతిలో ఇంగ్లండ్ జ‌ట్టు (IND vs ENG 5th Test) అద్భుత‌మైన విజ‌యాన్ని

న‌మోదు చేసింది. ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ న్యూజిలాండ్ ను మ‌ట్టి క‌రిపించింది.

ఏకంగా మూడు టెస్టుల‌లో విజ‌యం సాధించి చ‌రిత్ర సృష్టించింది. ఇదే స‌మ‌యంలో త‌మ‌ను ఇబ్బందికి గురి చేసి ఆడ‌కుండా వెళ్లి పోయిన

ఆఖ‌రు టెస్టులో ప్ర‌తీకారం తీర్చుకుంది ఇంగ్లండ్ జ‌ట్టు.

జో రూట్ కెప్టెన్సీ వ‌దులుకున్నాక ప‌గ్గాలు చేప‌ట్టిన బెన్ స్టోక్స్(Ben Stokes) కు అదృష్టం క‌లిసి వ‌చ్చిన‌ట్టుంది. ఐదు మ్యాచ్ ల టెస్టు సీరీస్ ను 

2-2 తో స‌మం చేసింది. గ‌త ఏడాది జ‌రిగిన నాలుగు టెస్టుల్లో భార‌త్ రెండు మ్యాచ్ ల‌లో గెలిస్తే ఇంగ్లండ్ ఒక‌టి గెలిచి స‌రిపెట్టుకుంది.

క‌రోనా కార‌ణంగా భార‌త ఆట‌గాళ్లు ఆడ‌కుండానే దుబాయ్ లోని ఐపీఎల్ లో ఆడారు. ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే భార‌త్ అద్భుతంగా ఆడింది

కానీ ఇంగ్లండ్ మాత్రం టీమిండియా కంటే ప‌దింత‌లు ఎక్కువ‌గా ప్ర‌తిభా పాట‌వాల‌ను ప్ర‌ద‌ర్శించింది.

378 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని ముందుంచింది భార‌త్. కానీ ఆ టార్గెట్ ను అవ‌లీల‌గా ఛేదించింది. కేవ‌లం మూడు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి

దుమ్ము రేపింది. కోలుకోలేని షాక్ ఇచ్చింది.

ఇంగ్లండ్ బ్యాట‌ర్లు జానీ బెయిర్ స్టో 114 ర‌న్స్ చేస్తే జో రూట్ 142 ర‌న్స్ చేసి మ‌రోసారి స‌త్తా చాటాడు. ఇదిలా ఉండ‌గా బెయిర్ స్టో రెండు

ఇన్నింగ్స్ ల‌లో సెంచ‌రీలు చేయ‌డం విశేషం. చెప్పి మ‌రీ కొట్ట‌డం విస్తు పోయేలా చేసింది.

ఇక తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ ను క‌ట్ట‌డి చేసిన భార‌త బౌల‌ర్లు రెండో ఇన్నింగ్స్ లో బుమ్రా త‌ప్ప ఏ ఒక్క‌రూ స‌త్తా చాట లేక చేతులెత్తేశారు.

Also Read : బెయిర్ స్టో మామూలోడు కాద‌బ్బా

Leave A Reply

Your Email Id will not be published!