Shailesh Reddy : విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమైన కార్యక్రమాలతో దేశంలోనే టాప్ లో ఉన్న టీశాట్ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఆంగ్ల భాష అన్నది అత్యవసరంగా మారింది.
ఉదయం నుంచి పడుకునేంత దాకా ఇంగ్లీష్ తోనే వ్యవహారాలు కొనసాగుతున్నాయి. మాతృ భాషను ఓ వైపు ప్రాధాన్యత ఇస్తూనే ఆంగ్ల భాషపై కూడా పట్టు సాధించాలని ప్రభుత్వం సూచించింది.
ఇందులో భాగంగా ఇటీవల వచ్చే ఏడాది నుంచి విద్యా సంస్థల్లో ఆంగ్ల భాషలో బోధన అన్నది తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు విద్యా శాఖ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది.
ఇందులో భాగంగా ఆన్ లైన్ లో , దృశ్య మాధ్యమాల ద్వారా టీ శాట్ విద్యా నిపుణులతో పాఠాలు చెప్పిస్తోంది. ఇవి విద్యార్థులకు, ఉద్యోగార్థులకు ఎంతగానో ఉపయోగ పడుతున్నాయి.
తాజాగా కేవలం విద్యార్థులు ఆంగ్ల భాషపై పట్టు సాధించేందుకు గాను ప్రత్యేకంగా పాఠాలు తయారు చేయించామని వెల్లడించారు టీ శాట్ సిఇఓ రాంపురం శైలేష్ రెడ్డి(Shailesh Reddy).
ఇందుకు గాన రంగారెడ్డి జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో ప్రణాళిక కూడా రూపొందించిందని తెలిపారు. ప్రతి రోజు గంట చొప్పున 20 రోజులు ఈ పాఠ్యాంశాలు ప్రసారం అవుతాయని చెప్పారు.
ఈనెల 15 నుంచి ఈ పాఠాలు కొనసాగుతున్నాయి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారం అవుతున్న ఈ పాఠాలను విని తమ ఇంగ్లీష్ నైపుణ్యాలను పెంచుకోవాలని సిఇఓ సూచించారు.
Also Read : జగనన్న భరోసా విద్యా దీవెన ఆసరా