Ericsson Layoffs : కొలువుల కోతపై ఎరిక్‌సన్ ఫోకస్
8,500 మంది తొలగిస్తున్నట్లు ప్రకటన
Ericsson Layoffs : ఆర్థిక మాంద్యం ఎఫెక్టు అన్ని రంగాలపై పడుతోంది. ప్రధానంగా ఐటీ, ఫార్మా, లాజిస్టిక్ , టెలికాం, ఆటో మొబైల్స్ తదితర సంస్థలన్నీ గంప గుత్తగా సిబ్బందిని సాగనంపే పనిలో పడ్డాయి. ఇప్పటికే ట్విట్టర్ , ఫేస్ బుక్ , గూగుల్ , అమెజాన్ , ఫిలిప్స్ , తదితర కంపెనీలన్నీ వేలాది మందిని తొలగించాయి. ఒక్కో కంపెనీ భారీ ఎత్తున తొలగిస్తున్నాయి. ఇదంతా కాస్ట్ కట్టింగ్ లో భాగమేనని గూగుల్ పేర్కొంది. ఇది పక్కన పెడితే మొదటగా జాబర్స్ ను తొలగించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది టెస్లా చైర్మన్ , ట్విట్టర్ బాస్ ఎలోన్ మస్క్.
ఫేస్ బుక్ లో 10 వేలు, మైక్రోసాఫ్ట్ లో 10 వేల మంది, అమెజాన్ లో 18 వేల మందిని తొలగించాయి . తాజాగా వీటి బాటలోనే చేరింది ప్రముఖ టెలికాం తయారీ సంస్థ ఎరిక్ సన్(Ericsson Layoffs). ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. ఆర్థిక మాంద్యం కారణంగా ఉద్యోగులను తాము భరించ లేమని తెలిపింది. ఇందులో భాగంగా 8,500 మందిని తీసి వేయనున్నట్లు ప్రకటించింది. చావు కబురు చల్లగా చెప్పింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ సంస్థలోని సిబ్బందిపై వేటు వేయనున్నట్లు తెలిపింది.
ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగుల తొలగింపు(Ericsson Layoffs) ఇదే మొదటిసారి కావడం విస్తు పోయేలా చేసింది. ముందు జాగ్రత్తగా ఈ చర్య కు ఉపక్రమించాల్సి వచ్చిందని ఎరిక్ సన్ కంపెనీ పేర్కొంది. స్వీడన్ లోనే 1,400 మందిని తొలగించనున్నట్లు తెలిపింది. రాబోయే రోజుల్లో ఇంకెన్ని కంపెనీలు ఎంత మందిని వేటు వేస్తాయోనని ఆయా సంస్థలలో పని చేస్తున్న ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
Also Read : రూ.305 కోట్ల జోయాలుకాస్ ఆస్తులు సీజ్