Etela Rajender : కేసీఆర్ క్ష‌మాప‌ణ చెప్పాల్సిందే – ఈట‌ల‌

ముదిరాజుల‌కు క్ష‌మాప‌ణ చెప్పాలి

Etela Rajender : భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ముదిరాజు జాతిని అవ‌మానించిన ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి నోటిని అదుపులో పెట్టుకోక పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు. మంగ‌శారం ఈట‌ల రాజేంద‌ర్ మీడియాతో మాట్లాడారు. ఆనాటి నైజాం న‌వాబును నేడు త‌ల‌పింప చేస్తున్నాడంటూ ఆరోపించారు. దొర‌ల పాల‌న కొన‌సాగుతోంద‌ని, తాను ఇష్టం వ‌చ్చిన‌ట్లు ప్ర‌జా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడంటూ ధ్వ‌జ‌మెత్తారు.

కేసీఆర్ కు క‌ళ్లు త‌ల‌కెక్కాయ‌ని , అహంకార పూరితంగా మాట్లాడుతున్నాడ‌ని, ఆయ‌న‌ను ఆస‌రాగా చేసుకుని మంత్రులు, ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు నోటికి వ‌చ్చిన‌ట్లు మాట్లాడుతున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీ ప్ర‌జ‌లంటే చుల‌కన భావం నెల‌కొంద‌న్నారు ఈట‌ల రాజేంద‌ర్(Etela Rajender). సీఎం క్యాంపు నీ జాగీరు కాద‌ని ప్ర‌శ్నించారు.

ప్ర‌జ‌ల‌ను బూతులు తిట్ట‌డం ప‌నిగా పెట్టుకున్నార‌ని ఫైర్ అయ్యారు. త‌న హ‌త్య‌కు కుట్ర జ‌రుగుతోంద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ఈట‌ల రాజేంద‌ర్. అందు కోసం రూ. 20 కోట్లు ఖ‌ర్చు చేస్తున్నార‌ని పేర్కొన్నారు. అణ‌గారిన ప్ర‌జ‌ల‌ను చుల‌క‌న‌గా చూస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు బీజేపీ అగ్ర నేత‌.

ముదిరాజ్ బిడ్డ‌ల జోలికి వ‌స్తే పుట్ట‌గ‌తులు ఉండ‌వ‌ని హెచ్చ‌రించారు. త‌మ జాతిని అవ‌మానించే హ‌క్కు మీకు ఎవ‌రు ఇచ్చార‌ని ప్ర‌శ్నించారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ను బొంద పెట్ట‌డం ఖాయ‌మ‌ని స్ప‌ష్టం చేశారు ఈట‌ల రాజేంద‌ర్.

Also Read : CM KCR Visits : విఠ‌ల్ రుక్మిణీ గుడిలో కేసీఆర్ పూజ‌లు

 

Leave A Reply

Your Email Id will not be published!