K Annamalai : అంద‌రివాడు కుప్పుసామి అన్నామ‌లై

త‌మిళ‌నాట బీజేపీ యువ నేత హవా

K Annamalai : త‌మిళ‌నాడు రాష్ట్రంలో భార‌తీయ జ‌న‌తా పార్టీకి పెద్ద దిక్కుగా మారారు కుప్పుస్వామి అన్నామ‌లై. మాజీ ఐపీఎస్ ఆఫీస‌ర్. ఉన్న‌ట్టుండి అమిత్ షా, బీఎల్ సంతోష్ దృష్టిలో ప‌డ్డారు. వెంట‌నే ఆ పార్టీకి రాష్ట్ర చీఫ్ గా ఎంపిక‌య్యారు. కేవ‌లం రెండు పార్టీలు డీఎంకే, అన్నాడీఎంకే ఆధిప‌త్యానికి మెల మెల్ల‌గా గండి కొట్టే ప్ర‌య‌త్నం చేస్తూ వస్తున్నాడు కె.అన్నామ‌లై(K Annamalai) .

ఆయ‌న ప్ర‌స్తుతం కొలువు తీరిన డీఎంకే ప్ర‌భుత్వాన్ని, సీఎం ఎంకే స్టాలిన్ ను టార్గెట్ చేస్తున్నారు. అంతే కాదు అన్నామ‌లై ఇప్పుడు త‌మిళ‌నాట మోస్ట్ పాపుల‌ర్ లీడ‌ర్ గా మారి పోయారు. క‌ర్నాట‌క‌లో తేజ‌స్వి యాద‌వ్ , త‌మిళ‌నాడులో అన్నామ‌లై హ‌ల్ చ‌ల్ చేస్తున్నారు.

సోష‌ల్ మీడియాలో మోస్ట్ పాపుల‌ర్ లీడ‌ర్ల‌లో బీజేపీకి సంబంధించి తేజ‌స్వి, అన్నామ‌లై, టెమ్ జెన్ ఇమ్నా, కిరెన్ రిజిజు, అనురాగ్ ఠాకూర్ ..ఇలా యంగ్ బ్ల‌డ్ కొన‌సాగుతోంది. తాజాగా కుప్పుస్వామి అన్నామ‌లై ఫోటో వైర‌ల్ గా మారింది. తాను బీజేపీకి రాష్ట్ర చీఫ్ అయినా తాను సామాన్యుడినేంటూ త‌న‌ను తాను ప్రూవ్ చేసుకుంటున్నారు అన్నామ‌లై.

క‌ర్ణాట‌క‌లో పోలీస్ విధుల్లో ఉండ‌గా సింగ‌మ్ గా పేరొందాడు. ఐఐఎంలో చేరాడు. సివిల్స్ వైపు మ‌ళ్లాడు. ప‌రీక్ష రాసి పాసై పోలీసు అధికారిగా తానేమిటో నిరూపించుకున్నాడు. ఆపై ట్ర‌బుల్ షూట‌ర్ క‌ళ్ల‌ల్లో ప‌డ్డాడు. ఇంకేం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు.

ఏ అంశంపైన నైనా కుప్పుస్వామి అన్నామ‌లై కూల్ గా స‌మాధానం ఇస్తారు. ప్ర‌త్య‌ర్థుల మాట‌ల‌కు, ప్ర‌శ్న‌ల‌కు ధీటైన రీతిలో రియాక్ట్ అవుతాడు. క‌ర్ణాట‌క కేడ‌ర్ కు చెందిన అన్నామ‌లై(K Annamalai) 2011వ బ్యాచ్ మాజీ ఐపీఎస్ ఆఫీస‌ర్. చిక్క‌మంగ‌ళూరు, ఉడిపి జిల్లాల ఎస్పీగా ప‌ని చేశారు. ప్ర‌స్తుతం ఓ అవ్వ‌తో క‌లిసి అన్నామ‌లై భోజ‌నం చేయ‌డం ఆస‌క్తిని రేపుతోంది.

నాయ‌కులంటే హంగు , ఆర్భాటాలు కాద‌ని సామాన్యులు, పేద‌ల‌తో క‌లిసి ఉండాల‌ని అన్నామ‌లై నిరూపిస్తున్నారు. ఇక త‌మిళ‌నాడులో ప్ర‌స్తుతం అన్నామ‌లై వ‌ర్సెస్ ఉద‌య‌నిధి స్టాలిన్ మ‌ధ్య పోరు ఉండ‌బోతోంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

ఏది ఏమైనా స‌మాజం కోసం ప‌ని చేసే వాళ్ల‌ను ప్ర‌జ‌లు ఏదో ఒక రోజు ఆద‌రిస్తార‌ని చ‌రిత్ర చెబుతున్న స‌త్యం. మ‌రి అన్నామ‌లై మ‌రో అన్నాదురై కానున్నారా.

Also Read : కేంద్రం నిర్వాకం సుప్రీంకోర్టు ఆగ్ర‌హం

Leave A Reply

Your Email Id will not be published!