YS Jagan : ‘వి మిస్ యు డాడీ’ అంటూ భావోద్వేగ పోస్ట్ పెట్టిన మాజీ సీఎం జగన్

ప్రతీసారి లాగే ఈ సారి కూడా జగన్, షర్మిల వేర్వేరుగా నివాళి అర్పించారు...

YS Jagan : ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్(YS Jagan) సోషల్ మీడియాలో భావోద్వేగానికి గురయ్యారు. ఎక్స్‌లోని పోస్ట్‌లో ‘వి మిస్ యూ డాడీ’ అని రాసి.. వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళి అర్పిస్తున్న ఫొటోలను జత చేశారు. కడప జిల్లా పర్యటనలో ఉన్న ఆయన సోమవారం ఉదయాన్నే పులివెందుల మండలం ఇడుపులపాయలో ఉన్న వైఎస్ఆర్ ఘాట్ దగ్గరికి వెళ్లారు. ఆయన వెంట తల్లి విజయ, సతీమణి భారతి, వైసీపీ నేతలు, కార్యకర్తలు ఉన్నారు. అక్కడికి చేరుకున్న అనంతరం జగన్ వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం వైఎస్ ఘాట్ దగ్గరికి వెళ్లి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఫాదర్ ప్రార్థన చేశారు.

YS Jagan Tweet

ప్రతీసారి లాగే ఈ సారి కూడా జగన్(YS Jagan), షర్మిల వేర్వేరుగా నివాళి అర్పించారు. ఇడుపులపాయలోని వైయస్సార్ ఘాట్ వ‌ద్ద వైఎస్ షర్మిల , కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి ఇతర కాంగ్రెస్ నేతలు వైఎస్ఆర్ కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ… “దివంగత ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించా. ప్రజల గుండెల్లో చిరకాలం చెరగని సంతకం చేసిన గొప్పనేత వైఎస్సార్. ఆయన లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిది. భౌతికంగా నాన్న మా మధ్య లేకపోయినా.. ప్రజల గుండెల్లో చిరకాలం జీవించే ఉన్నారు.

నాన్న ఆశయాలే .. లక్ష్య సాధనగా నన్ను చేయి పట్టి నడిపిస్తున్నాయి” అని పేర్కొన్నారు. తులసి రెడ్డి మాట్లాడుతూ.. వైయస్ రాజశేఖర్ రెడ్డి ఎన్నో ప్రాజెక్టులు పూర్తి చేసి.. రైతుల కళ్లలో వెలుగులు నింపారని కొనియాడారు. 5 సంవత్సరాల 3 నెలలపాటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా.. పేదల సంక్షేమం కోసం అహర్నిశలు కష్టపడ్డారని పేర్కొన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం ఆయన కల అని.. ఆ కల సాకారం చేయడం కోసం కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Also Read : CM Chandrababu : వరద ప్రాంతాలకు సీఎం వెళ్లొచ్చిన అధికారుల్లో కనపడని మార్పు

Leave A Reply

Your Email Id will not be published!