Eknath Shinde : ఆసుపత్రిలో చేరిన మహారాష్ట్ర మాజీ సీఎం షిండే

వైద్య పరీక్షలు నిమిత్తం వచ్చిన షిండే కోసం ఆసుపత్రి వద్ద వేచిచూస్తున్న మీడియాతో క్లుప్లంగా ఆయన మాట్లాడారు..

Eknath Shinde : జ్వరం బారిన పడిన మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే(Eknath Shinde) ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో ఆయనను థానేలోని జూపిటర్ ఆసుపత్రిలో మంగళవారంనాడు చేర్చారు. పూర్తి పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు ఆయనకు సూచించారు. వారం రోజుల నుంచి ఆయన జ్వరం, గొంతు ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో థానేలోని నివాసంలోనే ఆయన కొనసాగుతారా, ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన ‘వర్ష’ బంగ్లాకు తిరిగి వస్తారా అనేది ఇంకా నిర్ణయం కాలేదు. షిండే ఆరోగ్యం మెరుగుపడ లేదని, థానే నివాసంలోనే ఆయన ఉండే అవకాశం ఉందని సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Eknath Shinde…

వైద్య పరీక్షలు నిమిత్తం వచ్చిన షిండే కోసం ఆసుపత్రి వద్ద వేచిచూస్తున్న మీడియాతో క్లుప్లంగా ఆయన మాట్లాడారు. ‘అంతా బాగుంది’ అంటూ వారి ప్రశ్నలకు సమాధానమిచ్చారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియ విషయంలో షిండే అసంతృప్తిగా ఉన్నారన్న ఊహాగానాల నేపథ్యంలో గత శుక్రవారంనాడు ఆయన సతారా జిల్లాలోని తన స్వగ్రామానికి వెళ్లారు. అప్పట్నించి ఆయన జ్వరంతో బాధపడుతున్నారు. మరోవైపు డిసెంబర్ 5న ‘మహాయుతి’ ప్రభుత్వం ప్రమాణస్వీకారానికి ముంబైలోని ఆజాద్ మైదానంలో విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టడం ఖాయమే అయినప్పటికీ ‘మహాయుతి’ కూటమి ఇంతవరకూ సీఎం పేరు ప్రకటించలేదు. ఇందుకు సన్నాహకంగా డిసెంబర్ 4న లెజిస్లేచర్ పార్టీ సమావేశాన్ని బీజేపీ ఏర్పాటు చేస్తోంది. ఈ సమావేశంలో లెజిస్లేచర్ పార్టీ నేతను ఎన్నుకుంటారు. ఆయనే ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టే అవకాశం ఉంటుంది.

Also Read : Phone Tapping Case : మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మాజీ డీఎస్పీ పై కూడా కేసు..

Leave A Reply

Your Email Id will not be published!