Ex Minister KTR : సీఎం రేవంత్ బీజేపీలో చేరడం ఖాయమంటున్న మాజీ మంత్రి
సిద్దిపేటలో హరీశ్‌రావు క్యాంపు కార్యాలయంపై దాడి ఘటనపై కేటీఆర్ స్పందిస్తూ...
KTR : సీఎం రేవంత్‌రెడ్డి త్వరలోనే తన బృందంతో కలిసి బీజేపీలో చేరతారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. రేవంత్ తదుపరి రాజకీయ మజిలీ బీజేపీతోనేనని చెప్పారు. ముఖ్యమంత్రే పార్టీ మారి.. కొత్త చరిత్రకు నాంది పలుకుతారేమోనన్నారు. తాను పుట్టింది బీజేపీలోనే.. చివరి రాజకీయ ప్రస్థానం కూడా బీజేపీతోనే ముగుస్తుందంటూ ప్రధాని మోదీతో, అమిత్‌షాతో రేవంత్ చెప్పారని తెలిపారు. కాషాయ జెండాతోనే ఏబీవీపీలో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించానని, అదే జెండా కప్పుకొని చనిపోతానని మోదీతో చెప్పినమాట వాస్తవమో, కాదో రేవంత్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. శనివారం తెలంగాణ భవన్‌లో మీడియాతో కేటీఆర్(KTR) ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశామని ప్రభుత్వం చెబుతోందని, కానీ.. 40ు మంది రైతులకు కూడా మాఫీ కాలేదన్నారు. సోమ లేదా మంగళవారం నుంచి రుణ మాఫీ పొందని వారి వివరాలు సేకరిస్తామని, అనంతరం కలెక్టర్ నుంచి రాష్ట్రస్థాయిలో మంత్రులు, సీఎం వరకు వినతులు అందజేస్తామని చెప్పా రు. అప్పటికీ మాఫీ చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని, అవసరమైతే రైతాంగ ఉద్యమానికి శ్రీకారం చుడతామని ప్రకటించారు.
KTR Comment
సిద్దిపేటలో హరీశ్‌రావు క్యాంపు కార్యాలయంపై దాడి ఘటనపై కేటీఆర్(KTR) స్పందిస్తూ.. ప్రభుత్వంలో ఉన్నవారే ప్రభుత్వ ఆస్తులపై దాడులు చేయించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఈ దాడికి పాల్పడిన వారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. ముఖ్యమంత్రికి చెందిన ఓ మీడి యా సంస్థ ఆలిండియా సర్వీ్‌సలో ఉన్న అధికారుల వద్దకు వెళ్లి.. వారిపై దాడి చేసేలా వ్యవహరిస్తోందని, ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాగా, తమ ప్రభుత్వ హయాంలో లక్ష ఉద్యోగాల కల్పనతో ప్లాంటు నెలకొల్పేలా ఫాక్స్‌కాన్ కంపె నీ ఒప్పందం కుదుర్చుకుందని కేటీఆర్ తెలిపారు. అయితే ఇప్పుడు ఆ కంపెనీ 40 వేల ఉద్యోగాలతో బెంగళూరులో క్యాం పస్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిందన్నారు. ఫాక్స్‌కాన్ పెట్టుబడులు, విస్తరణపై నిజానిజాలను ప్రభు త్వం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కాగా, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్న మహిళల పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఈ నెల 24న కమిషన్ ఎదుట హాజరవుతానని కేటీఆర్ చె ప్పారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న ఘటనల వివరాలను కమిషన్‌కు అందజేస్తాని తెలిపారు.
Also Read : Russia Earthquake : రష్యాలో భారీ భూకంపం సునామి హెచ్చరికలు జారీ చేసిన సిబ్బంది