Manmohan Singh : మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ దిగ్భ్రాంతి

జ‌పాన్ మాజీ ప్ర‌ధాన మంత్రి షింజే అబే పై కామెంట్

Manmohan Singh : జ‌పాన్ మాజీ ప్ర‌ధాన మంత్రి షింజే అబే శుక్ర‌వారం ప్ర‌చారం చేస్తుండ‌గా కాల్చి వేత‌కు గుర‌య్యాడు. ఈ సంద‌ర్భంగా యావ‌త్ ప్ర‌పంచం విస్మ‌యాన్ని వ్య‌క్తం చేసింది.

ప్ర‌ధాన‌మంత్రులు, దేశాధినేత‌లు, ప్రెసిడెంట్లు, రాయ‌బారులు పెద్ద ఎత్తున సంతాపం తెలిపారు. ఇంకా తెలియ చేస్తూనే ఉన్నారు.

సుదీర్ఘ కాలం పాటు జ‌పాన్ దేశానికి ప్ర‌ధాన మంత్రిగాఉన్నారు షింజే అబే. ఆయ‌న ఎన్నో సంస్క‌ర‌ణ‌లు తీసుకు వ‌చ్చారు ఆ దేశంలో. దేశం స్వ‌యం సమృద్దిని సాధించడంలో కీల‌క పాత్ర పోషించారు.

ప్ర‌ధానంగా ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల‌తో మెరుగైన సంబంధాలు పెట్టుకున్నారు. కానీ ఎక్కువ‌గా ఆయ‌న భార‌త దేశంతో స్నేహ సంబంధాన్ని కొనాసాగిస్తూ వ‌చ్చారు.

షింజే అబే కు భార‌త ప్ర‌భుత్వం అత్యున్న‌త‌మైన అవార్డుతో స‌త్క‌రించింది. దేశం గ‌ర్వించ ద‌గిన పుర‌స్కారంగా భావించే ప‌ద్మ‌విభూష‌ణ్ తో గౌర‌వించింది.

తాజాగా జ‌పాన్ మాజీ ప్ర‌ధాని కాల్చివేత‌కు గురయ్యార‌న్న వార్త తెలిసిన వెంట‌నే భార‌త ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ స్పందించారు. తాను న‌మ్మ‌లేక పోయాన‌ని కానీ ఇది నిజం అని తెలిశాక బాధ‌కు లోనైన‌ట్లు తెలిపారు.

మ‌రో వైపు సుదీర్ఘ‌మైన అనుబంధం క‌లిగి ఉన్న భార‌త దేశ మాజీ ప్ర‌ధాన మంత్రి డాక్ట‌ర్ మ‌న్మోహ‌న్ సింగ్(Manmohan Singh) ఆవేద‌న వ్య‌క్తం చేశారు. శుక్ర‌వారం ఆయ‌న విష‌యం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన‌ట్లు పేర్కొన్నారు.

ఇదే విష‌యాన్ని జాతీయ మీడియా ఏఎన్ఐ వెల్ల‌డించింది. గొప్ప స్నేహితుడిని తాను కోల్పోయాన‌ని పేర్కొన్నారు మాజీ పీఎం.

Also Read : దిగ్గ‌జ పాల‌కుడిని కోల్పోయిన ప్ర‌పంచం

Leave A Reply

Your Email Id will not be published!