Kothakota Dayakar Reddy : కొత్త‌కోట ద‌యాక‌ర్ రెడ్డి క‌న్నుమూత‌

టీడీపీ మాజీ ఎమ్మెల్యే మృతితో విషాదం

Kothakota Dayakar Reddy : ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కొత్త‌కోట ద‌యాకర్ రెడ్డి ఇక లేరు. ఆయ‌న హైద‌రాబాద్ లోని ఏఐజీ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మంగ‌ళ‌వారం క‌న్ను మూశారు. తెలుగుదేశం పార్టీలో కీల‌క‌మైన నాయ‌కుడిగా ఉన్నారు. త‌న వాయిస్ ను వినిపిస్తూ వ‌చ్చారు. ఆత్మ‌కూర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంత‌రం మ‌క్తల్ నియోజ‌క‌వ‌ర్గం శాస‌న స‌భ్యునిగా ఉన్నారు.

కొంత కాలంగా ఆయ‌న అనారోగ్యంతో ఉన్నారు. చికిత్స నిమిత్తం ఏఐజీ ఆస్ప‌త్రిలో చేరారు. ఇవాళ తెల్ల వారు జామున క‌న్నుమూశారు. ఆయ‌న స్వ‌స్థ‌లం ప‌ర్కాపురంలో ఉంటున్నారు. ఇటీవ‌లే ఆయ‌న చికిత్స తీసుకుని ఆరోగ్యంగా ఉన్నారు. కానీ ఉన్న‌ట్టుండి మ‌రోసారి తీవ్ర అనారోగ్యానికి గురి కావ‌డంతో వెంటనే ఏఐజీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

ఆయ‌న భార్య సీతా ద‌యాక‌ర్ రెడ్డి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్ గా ప‌ని చేశారు. ఇదిలా ఉండ‌గా కొత్త కోట ద‌యాక‌ర్ రెడ్డి(Kothakota Dayakar Reddy) మ‌ర‌ణంపై సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు, టీడీపీ చీఫ్‌, మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, మాజీ మంత్రి డీకే అరుణ‌, మాజీ ఎమ్మెల్యే భ‌ర‌త సింహా రెడ్డి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎర్ర శేఖ‌ర్, రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి తీవ్ర సంతాపం తెలిపారు.

Also Read : Santosh Kumar Suman : బీహార్ సీఎంకు షాక్ మంత్రి గుడ్ బై

 

Leave A Reply

Your Email Id will not be published!