Munugodu By Poll Tension : మునుగోడు ఉప ఎన్నిక‌పై ఉత్కంఠ

ప్ర‌ధాన పార్టీలకు ప్ర‌తిష్టాత్మ‌కం

Munugodu By Poll Tension : దేశంలో ప‌లు చోట్ల ఉప ఎన్నిక‌లు జ‌రుగుతున్నా ప్ర‌ధానంగా ఫోక‌స్ మాత్రం తెలంగాణ‌లోని మునుగోడు ఉప ఎన్నిక‌పైనే నిలిచింది. ఇక్క‌డ నువ్వా నేనా అన్న రీతిలో పోటీ కొన‌సాగింది. ఈ నియోజ‌క‌వ‌ర్గం కాంగ్రెస్ , క‌మ్యూనిస్టుల‌కు కంచుకోట‌గా ఉంటూ వ‌చ్చింది. 2,41,805 ఓట‌ర్లు ఉన్నారు.

యువ‌తీ యువ‌కుల ఓట‌ర్లే అత్య‌ధికంగా ఉన్నాయి. వారి పైనే అభ్య‌ర్థుల భ‌విత‌వ్యం నెల‌కొంది. కోట్లాది రూపాయ‌లు, లెక్క‌కు మించిన మ‌ద్యం, బ‌హుమ‌తుల రూపేణా ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేశార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 6 కోట్ల‌కు పైగా న‌గ‌దు ప‌ట్టుబ‌డ‌డం విశేషం.

ఈ న‌గ‌దుకు సంబంధించి లెక్కా ప‌త్రం చూపించ లేద‌ని ఈసీ స్ప‌ష్టం చేసింది. 119 కేంద్రాల‌లో 298 పోలింగ్ కేంద్రాల‌ను ఏర్పాటు చేసింది. 3 వేల మంది పోలీసులు, 20 కేంద్ర బ‌ల‌గాలను మోహ‌రించారు. ఇప్ప‌టికే బీజేపీ, టీఆర్ఎస్ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు చోటు చేసుకున్నాయి.

బ‌రిలో చాలా మంది ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌ధానంగా బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్య‌ర్థుల(Munugodu By Poll Tension) మ‌ధ్యే ఉంటోంది. బీజేపీ నుంచి కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్ర‌వంతి రెడ్డి, టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి, బీఎస్పీ నుంచి న‌ర‌సింహ చారి పోటీలో ఉన్నారు.

ఇక్క‌డ రాజ‌గోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయ‌న త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేర‌డంతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్య‌మైంది. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కు జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య‌గా మారింది. రాబోయే ఎన్నిక‌ల‌కు ఇది స‌వాల్ కానుంద‌ని ఆ పార్టీ వ‌ర్గాలు అంటున్నాయి.

ఇక బీజేపీకి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌ర్ లోకి రావ‌డానికి ఇది బూస్ట్ లాగా ప‌ని చేస్తుంద‌ని భావిస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ బీజేపీ, టీఆర్ఎస్ అభ్య‌ర్థుల గెలుపును శాసిస్తుందే కానీ విజ‌యం సాధించే దాఖ‌లాలు లేవు.

టీఆర్ఎస్ చీఫ్‌, తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ కు ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరొందిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాకు మ‌ధ్య జ‌రిగిన పోటీగా భావించాల్సి ఉంటుంద‌ని రాజకీయ విశ్లేష‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు. అయితే ఎవ‌రు గెలిచినా ఒరిగేది ఏమీ ఉండ‌ద‌ని అంతా అగ్ర వ‌ర్ణాల‌కు చెందిన వారి చేతుల్లోనే ప‌వ‌ర్ ఉంటుందుని పేర్కొంటున్నారు.

Also Read : మునుగోడులో ఎగిరే జెండా ఎవ‌రిదో

Leave A Reply

Your Email Id will not be published!