President Election : దేశంలో ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. కాంగ్రెస్ కు పూర్తి నిరాశ కలిగిస్తే ఆప్ కు జోష్ నింపాయి ఈ ఎన్నికలు. తమ పనితీరుకు రెఫరెండమ్ గా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్లుగానే ఆ పార్టీ నాలుగు రాష్ట్రాలు ఉత్తరాఖండ్, గోవా, యూపీ, మణిపూర్ లలో తిరిగి అధికారంలోకి వచ్చింది.
దీంతో ఈ ఎన్నికలను సక్సెస్ గా ముగించిన హోష్ లో ఉన్న ప్రధాని మోదీ తదుపరి భారత రాష్ట్రపతి(President Election) పదవికి ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం.
అందరికీ ఆమోద యోగ్యంగా ఉండే వ్యక్తిని ఎంపిక చేయాలని భావిస్తుండగా విపక్షాలు సైతం ధీటైన వ్యక్తిని నిలబెట్టేందుకు పావులు కదుపుతున్నాయి.
దీంతో ఎవరు నిలబడతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
తాజా ఎన్నికల ఫలితాలతో బీజేపీకి రాజ్యసభ పై పట్టును పెంచేలా చేశాయి. మార్చి 31న జరిగే రాజ్యసభ ఎన్నికలతో పాటు జూలైలో జరగనున్న ప్రెసిడెంట్ ఎన్నికలపై తక్షణ ప్రభావం చూపేలా ఉంది.
భారత రాష్ట్రపతిని 776 మంది ఎంపీలు, 4 వేల 120 మంది ఎమ్మెల్యేలు ఏర్పాటు చేసిన ఎలక్టోరల్ కాలేజీ ద్వారా ఎన్నుకున్నారు.
ఎలక్టోరల్ కాలేజీ మొత్తం బలం 10, 98 , 903 ఓట్లు. కాగా ఇందులో బీజేపీ బలం సగం కంటే ఎక్కువగా ఉంది.
ఎంపీకి ఒక్కో ఓటు విలువ 708. ఎమ్మెల్యేల విషయానికి వస్తే ఒక్కో రాష్ట్రానికి ఒక్కో ఓటు విలువ భిన్నంగా ఉటుంది.
యూపీలో ఎమ్మెల్యే ఓటు విలువ 208గా ఉంది. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాష్ట్రపతి పదవికి ముందంజలో ఉన్నారు.
కానీ మోదీ మనసులో ఏముందో తెలియదు. ప్రస్తుతం కోవింద్ కు రెండోసారి పదవి ఇవ్వాలా వద్దా అన్న దానిపై ఇంకా హైకమాండ్ సిగ్నల్ ఇవ్వలేదు.
ఇప్పటి వరకు రాజేంద్ర ప్రసాద్ మాత్రమే రెండుసార్లు ఎన్నికయ్యారు రాష్ట్రపతిగా. ఓ వైపు గులాం నబీ ఆజాద్,
నితీశ్ కుమార్, శరద్ పవార్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మొత్తంగా కొంత కాలం పాటు వేచి చూస్తే తెలుస్తుంది.
Also Read : చరిత్రాత్మకం ఆప్ అఖండ విజయం