Samantha : స‌మంత త‌మిళ మూవీపై ఉత్కంఠ‌

ఖ‌తిజాగా నెగ‌టివ్ రోల్ లో సామ్

Samantha  : గ‌త ఏడాది అటు సినిమాలు ఇటు వెబ్ సీరీస్ తో ఫుల్ బిజీగా ఉన్న స‌మంత కొత్త సంవ‌త్స‌రంలో కూడా దుమ్ము రేపేందుకు రెడీ అవుతోంది.

ఇప్ప‌టికే ఆమె న‌టించిన స్పెష‌ల్ సాంగ్ ఊ అంటావా ఊ ఊ అంటావా సాంగ్ సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. అక్కినేని నాగ చైత‌న్య‌తో విడి పోయాక ఆమె ఎంచుకున్న పాత్ర‌లు చాలా ప‌వ‌ర్ ఫుల్ గా ఉంటున్నాయి.

ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సీరీస్ సెన్సేష‌న్ హిట్ గా నిలిచింది. స‌మంత (Samantha )న‌ట‌న‌కు వంద మార్కులు ప‌డ్డాయి. ఇక నెగ‌టివ్ రోల్ పై ఎక్కువ‌గా ఫోక‌స్ పెడుతూ వ‌చ్చింది. జాతీయ స్థాయిలో సామ్ కు మంచి పేరు కూడా వ‌చ్చింది.

ఆ త‌ర్వాత న‌టి అన్నాక అన్ని పాత్ర‌లు చేసి మెప్పించాల‌ని అంటోంది. ఇందులో భాగంగానే స‌మంత హాలీవుడ్ మూవీలో కూడా న‌టించేందుకు ఓకే చెప్పింది. ఇందుకు సంబంధించి అఫిసియ‌ల్ గా ప్ర‌క‌టించింది కూడా.

విచిత్రం ఏమిటంటే అరెంజ్మెంట్స్ ఆఫ్ ల‌వ్ మూవీలో బై సెక్కువ‌ల్ యువ‌తి పాత్ర పోషిస్తోంది. ఈ క్యారెక్ట‌ర్ పై ఇప్ప‌టికే చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ విష‌యాన్ని తానే అధికారికంగా ప్ర‌క‌టించింది కూడా.

ఇదిలా ఉండ‌గా స‌మంత పూర్తిగా నెగ‌టివ్ విల‌న్ క్యారెక్ట‌ర్ లో న‌టించింద‌ని టాక్. అదేమిటంటే త‌మిళంలో స్టార్ హీరో సేతుప‌తి, న‌య‌న‌తార తో క‌లిసి కాత్తువాక్కుల రెండు కాద‌ల్ మూవీలో విల‌నిజం చూపించేలా న‌టిస్తోంద‌ని టాక్.

విశ్నేష్ శివ‌న్ దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. త్వ‌ర‌లో ఇది విడుద‌ల కానుంది.

Also Read : తండ్రికి త‌గ్గ త‌న‌యుడు

Leave A Reply

Your Email Id will not be published!