KCR : చూస్తే బక్క పల్చగా కనిపిస్తారు సీఎం కేసీఆర్. కానీ వ్యూహాలు పన్నడంలో రాజకీయంగా పై చేయి సాధించడంలో తనకు తానే సాటి. దేశంలో ఏ అంశం మీదనైనా మాట్లాడే, పూర్తిగా విడమర్చి చెప్పే అరుదైన నాయకులలో కేసీఆర్ టాప్ లో ఉంటారు.
ఆయనకు పలు భాషలపై పట్టుంది. ప్రత్యేకించి తెలంగాణ భాషతో పాటు ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ లో ఎంత సేపైనా గంటల కొద్దీ మాట్లాడగలరు.
ఉద్యమ నాయకుడిగా ప్రారంభమై కొత్త రాష్ట్రంలో రెండోసారి పవర్ లోకి వచ్చిన అరుదైన నాయకుడు కేసీఆర్.
ఆయన కల దేశ రాజకీయాలలో కీలక పాత్ర పోషించాలని. ఆ దిశగా పావులు కదుపుతున్నారు.
తన ఆలోచనలకు రెక్కలు తొడిగే పనిలో ఉన్నారు. ఎక్కడా తొందర పడకుండా వ్యూహాత్మకంగా అడుగు వేయడంలో ఆయనకు ఆయనే సాటి.
నిన్నటి దాకా బీజేపీతో దోస్తీ చేసిన సీఎం ఉన్నట్టుండి ఇప్పుడు వ్యతిరేకంగా మారారు.
బీజేపీయేతర పార్టీలు, నేతలతో మీట్ అవుతూ వస్తున్నారు. తాజాగా త్వరలో యూపీలో జరిగే ఎన్నికల్లో ప్రచారం చేయనున్నట్లు ప్రకటించారు.
మరోసారి ఈ ప్రకటనతో దేశ వ్యాప్తంగా కేసీఆర్(KCR) చర్చనీయాంశంగా మారారు.
అనూహ్యంగా రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారికి పరిహారం ప్రకటించారు. పార్లమెంట్ లో అన్ని బిల్లులకు పూర్తిగా మద్దతు తెలిపారు కేసీఆర్.
తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేస్తూ వస్తున్నారు.
ఈ మేరకు ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ సపోర్ట్ కూడా తీసుకుంటున్నట్లు సమాచారం.
ఇందులో భాగంగానే అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ ఎదగనీయకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి నుంచే ఆయా నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల పనితీరుపై కూడా ఆరా తీస్తున్నట్లు ప్రచారం (KCR)జరుగుతోంది.
మరో వైపు ఊహించని రీతిలో బీజేపీకి ఆదరణ పెరుగుతుండడంపై ఫోకస్ పెట్టారు. ఇటు స్వంత రాష్ట్రంలో పట్టు సాధించేలా జాతీయ స్థాయిలో మూడో ఫ్రంట్ కు నాయకత్వం వహించేలా ప్లాన్ చేస్తున్నట్లు టాక్.
ఏది ఏమైనా కేసీఆర్ మనసులో ఏముందో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఆయనను మించిన వ్యూహకర్త ఎవరూ లేరు.
Also Read : ఆదర్శప్రాయుడు వివేకానందుడు