BCCI Selection Committee : సెలెక్షన్ కమిటీ ఎంపికపై కసరత్తు
ఎవరికి దక్కేనో అవకాశం
BCCI Selection Committee : కోట్లాది రూపాయల ఆదాయం కలిగిన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కొత్త పరీక్షను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆటగాళ్ల ఎంపిక విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రతిభ కలిగిన ఆటగాళ్లకు ప్రయారిటీ ఇవ్వడం లేదని కేవలం ఆడక పోయినా పనిగట్టుకుని వారిని కంటిన్యూ చేస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.
సోషల్ మీడియాలో బీసీసీఐ కంటే ఎక్కువగా కేరళ స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ ట్రెండింగ్ లో ఉన్నాడు. ప్రస్తుతం ఎంపిక చేసిన టీ20 సీరీస్ లో కానీ వన్డే సీరీస్ లో కానీ మిగతా ఆటగాళ్ల కంటే పర్ ఫార్మెన్స్ బాగనే ఉన్నప్పటికీ సెలెక్షన్(BCCI Selection Committee) చేయకుండా పక్కన పెట్టడం వివాదానికి దారి తీసింది.
ప్రధానంగా కేవలం టీ20కి మాత్రమే ఎంపిక చేసి వన్డేకు పక్కన పెట్టారు. త్వరలో భారత్ లో వన్డే వరల్డ్ కప్ జరగనుంది. ఈ తరుణంలో ఇప్పటికే బీసీసీఐ ముంబై వేదికగా ప్రధాన కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించింది. పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే వరల్డ్ కప్ లో ఆడే భారత క్రికెట్ జట్టును 20 మందితో ఎంపిక చేసినట్లు టాక్.
అయితే ముందుగా లీక్ చేస్తే మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయనే భయంతో డిక్లేర్ చేయలేదు. ప్రస్తుతం ఇప్పటి వరకు ఉన్న సెలెక్షన్ కమిటీని పూర్తిగా రద్దు చేసింది బీసీసీఐ. కేవలం చేతన్ శర్మను మాత్రమే ఉంచింది. కొత్త సెలెక్షన్ కమిటీ ఎంపిక కోసం ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించింది బీసీసీఐ.
ప్రస్తుతం ప్యానల్ కమిటీ ఇంటర్వ్యూలు చేపడుతోంది. రోహిత్ తర్వాత ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై కూడా కమిటీ ప్రశ్నించినట్లు టాక్. ఏది ఏమైనా ఎవరు వచ్చినా బీసీసీఐ తీరులో మార్పు ఉండదని తేలి పోయింది.
Also Read : సంజూ శాంసన్ కు ఛాన్స్ ఇవ్వాలి
Need job my cast is sc we are very poor studing inter 3nd year