Neeraj Chopra : కళ్లు..కాళ్లు భూమి మీదే ఉండాలి – నీరజ్ చోప్రా
పతకం సాధించాక సంచలన కామెంట్స్
Neeraj Chopra : యావత్ భారతం ఇవాళ ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో జావలెన్ త్రో లో రజత పతకాన్ని సాధించాడు హర్యానాలోని పానిపట్ కు చెందిన నీరజ్ చోప్రా.
ఆయన ఇప్పటికే ఎన్నో పతకాలు సాధించారు. దేశానికి గర్వ కారణంగా నిలిచారు. ప్రధాన మంత్రి నుంచి ముఖ్యమంత్రులు, ప్రముఖులు, అన్ని రంగాలకు చెందిన వారంతా విన్నర్ గా నిలిచన నీరజ్ చోప్రాను(Neeraj Chopra) అభినందనలతో ముంచెత్తుతున్నారు.
ఈ సందర్భంగా పతకం అందుకున్న అనంతరం నీరజ్ చోప్రా మీడియాతో మాట్లాడారు. జీవితం పట్ల కీలకమైన వ్యాఖ్యలు చేశారు. శ్రమిస్తే ఏదైనా సాధ్యమవుతుందని నన్ను చూస్తే తెలుస్తుంది.
నాలాంటి వాళ్లు ఎందరో భారత దేశంలో ఉన్నారు. వారు కూడా ఏదో ఒక రోజు భారతీయ పతాకాన్ని ముద్దాడతారు. ప్రపంచ వేదికపై భరత మాత సగర్వంగా తల ఎత్తుకునేలా చేస్తారన్న నమ్మకం తనకు ఉందన్నాడు నీరజ్ చోప్రా(Neeraj Chopra) .
అయితే మిగతా క్రీడల కంటే అథ్లెటిక్స్ విభాగంలో ఉన్న వారికి టైం తక్కువగా ఉంటుందన్నాడు. ఎన్ని సాధించినా, ఎన్ని అవార్డులు అందుకున్నా, ఎంతగా ఆదరణ లభించినా ఉన్న చోటు మరిచి పోకూడదని తాను నమ్ముతానని చెప్పాడు నీరజ్ చోప్రా.
తాను ఎప్పుడూ కళ్లు..కాళ్లు ఈ భూమి మీదే ఉండాలని కోరుకుంటానని అన్నాడు. తాను పుట్టిన నేల, ఊరు, నా వాళ్లు, నా దేశం నాకు ముఖ్యమని మరోసారి స్పష్టం చేశాడు.
ప్రస్తుతం నీరజ్ చోప్రా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జీవితం చిన్నది. కాలం గొప్పది. ప్రకృతి అంతకంటే గొప్పది. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలన్నది చోప్రా ఆశయం.
Also Read : నిన్ను చూసి దేశం గర్విస్తోంది