F3 Trailer : ఎఫ్ 3 ట్రైల‌ర్ నవ్వుల పండుగ

మే 27న థియేట‌ర్ల‌లో న‌వ్వులే

F3 Trailer : అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో విక్ట‌రీ వెంక‌టేశ్ , వ‌రుణ్ తేజ్ , త‌మ‌న్నా భాటియా, మెహ‌రీన్ క‌లిసి న‌టించిన ఎఫ్‌-3 మూవీకి సంబంధించిన ట్రైల‌ర్ విడుద‌లైంది.

ఎఫ్-2 చిత్రానికి ఇది సీక్వెల్. న‌వ్వుల పూవులు పూయిస్తోంది. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన పోస్ట‌ర్లు, టీజ‌ర్ల‌కు భారీ ఆద‌ర‌ణ ల‌భించింది. ఇదే స‌మ‌యంలో ఇవాళ రిలీజ్ చేసిన ఎఫ్-3 ట్రైల‌ర్ ఆక‌ట్టుకునేలా ఉంది.

ఇప్ప‌టికే అనిల్ రావిపూడి ద‌ర్శ‌కుడిగా త‌న‌ను తాను ప్రూవ్ చేసుకున్నాడు. స్వ‌త‌హాగా ర‌చ‌యిత కూడా. ఆయ‌న తీసిన సినిమాల‌న్నీ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది.

ఈ చిత్రాన్ని నిర్మాత దిల్ రాజు నిర్మిస్తుండ‌గా ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడు.

ఇంకా ఈ చిత్రంలో న‌ట కిరీటి రాజేంద్ర ప్ర‌సాద్ , ప్ర‌గ‌తి, ఆలీ, సునీల్ , త‌దిత‌రులు న‌టిస్తున్నారు. విచిత్రం ఏమిటంటే పుష్ప మూవీలో స‌మంత స్పెష‌ల్ సాంగ్ తో దుమ్ము రేపితే ఇదే సినిమాలో బుట్ట బొమ్మ పూజా హెగ్డే ప్ర‌త్యేక పాట‌తో ఆక‌ట్టుకోనుంది.

ఇప్ప‌టికే ఆమెతో స్పెష‌ల్ సాంగ్ ను చిత్రీక‌రించారు ద‌ర్శ‌కుడు. ఈ త‌రుణంలో ఇవాళ విడుద‌లైన ఎఫ్‌3 దుమ్ము రేపుతోంది. రిలీజ్ అయిన క్ష‌ణాల్లోనే మిలియ‌న్ల వ్యూస్ తో దూసుకు పోతోంది.

క‌డుపుబ్బా న‌వ్వించే మాట‌లు, యాక్ష‌న్ , సాంగ్స్ ఆక‌ట్టుకుంటోంది. ఫ‌న్ మాత్రం ప‌క్కా అని తేలి పోయింది. ఇదిలా ఉండ‌గా ఎఫ్ -3 ని న‌వ్వులు పూయించేందుకు ఈనెల 27న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. మ‌నంద‌రినీ అల‌రించ‌నుంది.

 

Also Read : మ‌హేష్ మూవీకి గుడ్ న్యూస్

 

Leave A Reply

Your Email Id will not be published!