Woo Aa Aha Aha Song : ఎఫ్‌-3 ఊ..ఆ..హ‌..హా సాంగ్ వైర‌ల్

ఆగ‌లేమంటున్న ఫ్యాన్స్ ర‌చ్చ‌

Woo Aa Aha Aha Song : దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపు దిద్దుకుంటున్న ఎఫ్ -3 మూవీకి సంబంధించి ఇవాళ రెండో సాంగ్ ఊ ..ఆ..హ‌..హా సాంగ్ (Woo Aa Aha Aha Song) విడుద‌లైంది.

ఇప్ప‌టికే వేలాది మంది ఈ సాంగ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఎఫ్ -2 మూవీకి ఈ చిత్రం సీక్వెల్ గా వ‌స్తోంది. ఇందులో విక్ట‌రీ వెంక‌టేశ్ , త‌మ‌న్నా భాటియా, వ‌రుణ్ తేజ్ , మెహ‌రీన్ తో పాటు సునీల్ , ఆలీ, ప్ర‌గ‌తి , త‌దిత‌రులు న‌టిస్తున్నారు.

సోనాల్ చౌహాన్ కీ రోల్ పోషిస్తోంది. ఇక ముద్దుగుమ్మ పూజా హెగ్డే ఐటం సాంగ్ లో న‌టిస్తుండ‌డంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన ఫోటోలు, ట్రైల‌ర్ , సాంగ్ దుమ్ము రేపాయి.

తాజాగా శుక్ర‌వారం విడుద‌ల చేసిన ఊ..ఆ..హ‌..హా సాంగ్ రికార్డులు బ్రేక్ చేసే స్థాయికి చేరుకోనుంది. ఇక రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ చిత్రానికి మ్యూజిక అందిస్తున్నారు. ఎఫ్ -2 కు కూడా ఆయ‌నే అందించారు.

ఇక ఇటీవ‌ల దేశాన్ని ఒక ఊపు ఊపేసిన పుష్ప చిత్రానికి కూడా దేవిశ్రీ ప్ర‌సాదే ఇచ్చాడు. డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ఈ క్రేజీ ల‌వ్ సాంగ్ ను షేర్ చేశాడు. మాస్ బీట్ తో సాగుతోంది ఈ పాట‌.

కాస‌ర్ల శ్యామ్ రాసిన ఈ పాట‌ను సునిధి చౌహాన్ , ల‌వితా లోబో, సాగ‌ర్, ఎస్పీ అభిషేక్ పాడారు. ఈ చిత్రం వ‌చ్చే నెల మే 27న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక ఎఫ్ 3లో శ్రీ‌నివాస్ రెడ్డి, ప్ర‌గ‌తి, రాజేంద్ర ప్ర‌సాద్, అన్న‌పూర్ణ‌మ్మ‌, అంజ‌లి కూడా న‌టిస్తున్నారు.

Also Read : ఫైట్స్ లో ఎక్స్ ప‌ర్ట్ అయితే ప్ర‌భాస్ తో చాన్స్

Leave A Reply

Your Email Id will not be published!