IND vs SL 1st Test : మొహాలీలో ఎదురీదుతున్న శ్రీ‌లంక

చేతిలో 6 వికెట్లు 466 ప‌రుగులు వెనుకంజ‌

IND vs SL 1st Test  : టీమిండియాతో మొహాలీ వేదిక‌గా జ‌రుగుతున్న ఫ‌స్ట్ టెస్టు మ్యాచ్ లో భార‌త్ త‌న ఆధిప‌త్యాన్ని కొన‌సాగిస్తూనే ఉంది. మొద‌టి ఇన్నింగ్స్ లో 574 ప‌రుగుల వ‌ద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌.

భారీ టార్గెట్ ఛేద‌న‌లో బ‌రిలోకి దిగిన శ్రీ‌లంక రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి 4 వికెట్లు కోల్పోయి 108 ప‌రుగులు చేసింది. ఇంకా ఆ జ‌ట్టు చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. ఇంకా 466 ప‌రుగులు చేయాల్సి ఉంది.

ఆ ర‌న్స్ ను అధిగ‌మించాలంటే ఇంకా క‌ష్ట ప‌డాల్సి ఉంటుంది మొత్తంగా మ్యాచ్ ను చూస్తే పూర్తిగా భార‌త్(IND vs SL 1st Test ) చేతిలోనే ఉంది. మొద‌టి రోజు ర‌వీంద్ర జ‌డేజా త‌న బ్యాటింగ్ తీరుతో ఆక‌ట్టుకున్నాడు.

లంకేయుల భ‌ర‌తం ప‌ట్టాడు. 175 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ర‌విచంద్ర‌న్ అశ్విన్ రెండు వికెట్లు తీశాడు. అశ్విన్ తిరిమ‌న్నెను తొల‌గించ‌గా జ‌డేజా క‌రుణ ర‌త్నే వికెట్ తీశాడు.

ఓపెన‌ర్ తిరిమన్నె 17 ప‌రుగులు చేస్తే దిముతె 28 ప‌రుగులు చేసి పెవిలియ‌న్ దారి ప‌ట్టారు. 35వ ఓవ‌ర్ లో 22 ప‌రుగుల వ‌ద్ద ఏంజెలో మాథ్యూస్ ను జ‌స్ప్రీత్ బుమ్రా అవుట్ చేశాడు.

ఆ త‌ర్వాత ధ‌నంజ‌య డిసిల్వాను ప‌డ‌గొట్టాడు అశ్విన్. ఇదిలా ఉండ‌గా అంత‌కు ముందు రెండో రోజు ఆస్ట్రేలియా మాజీ దిగ్గ‌జ ఆట‌గాడు షేన్ వార్న్ హ‌ఠాన్మ‌ర‌ణం పై బీసీసీఐ స‌మావేశం చేప‌ట్టింది.

మాజీ కెప్టెన్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, హెడ్ కోచ్ ద్ర‌విడ్ తీవ్ర సంతాపం వ్య‌క్తం చేశారు. వీరితో పాటు శ్రీ‌లంక ఆట‌గాళ్లు సైతం నివాళి అర్పించారు.

Also Read : క్రికెట్ యోధుడా అల్విదా

Leave A Reply

Your Email Id will not be published!