Faf Du Plessis Sixer : ఫాప్ డు ప్లెసిస్ సూపర్ సిక్సర్
రూ. 10 లక్షల ప్రైజ్ విన్నర్
Faf Du Plessis Sixer : ఈసారి జరిగిన ఐపీఎల్ 16వ సీజన్ లో పరుగుల వరద పారింది. సీనియర్లు, జూనియర్లు పోటా పోటీగా ఆడేందుకు ట్రై చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఫోర్లు, సిక్సర్ల మోత మోగింది. అత్యధిక ఫోర్లు బాదిన క్రికెటర్ గా శుభ్ మన్ గిల్ నిలిచాడు. పలు అవార్డులు స్వంతం చేసుకున్నాడు. ఇక సిక్సర్ల విషయానికి వస్తే కళ్లు చెదిరేలా అన్ని జట్లకు చెందిన ఆటగాళ్లు ప్రయత్నించారు. దంచి కొట్టారు. ఫోర్ల కంటే సిక్సర్లు కొట్టేందుకు పోటీ పడ్డారు క్రికెటర్లు.
ఎందరో సిక్సర్లు కొట్టినా అత్యధిక సీక్సర్ మాత్రం ఒకే ఒక్కడి పేరు మీద నమోదైంది. అతడు ఎవరో కాదు కోహ్లీ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు నాయకత్వం వహించిన ఫాఫ్ డు ప్లెసిస్(Faf Du Plessis). ఐపీఎల్ లో భాగంగా జరిగిన మ్యాచ్ లో ఏకంగా సిక్సర్ బాదాడు. అది స్టేడియానికి ఆనుకుని పడింది. ఆ సిక్సర్ 115 మీటర్ల దూరంగా నమోదైంది. ఇదే భారీ సిక్సర్ గా ఐపీఎల్ అవార్డుల కమిటీ పేర్కొంది. ఈ మేరకు ఐపీఎల్ 16వ సీజన్ కు సంబంధించి బిగ్ సిక్సర్ బ్యాటర్ గా గుర్తింపు దక్కింది.
ఈ మేరకు అవార్డు ప్రకటించింది. ఫాఫ్ డుప్లెసిస్ కు రూ. 10 లక్షల క్యాష్ ప్రైజ్ కూడా దక్కింది. మొత్తంగా ప్లే ఆఫ్స్ కు వెళ్లకుండా గుజరాత్ టైటాన్స్ ఆ జట్టు ఆశలపై నీళ్లు చల్లింది. బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్ లో హోం గ్రౌండ్ లోనే ఓడించింది పాండ్యా సేన. కోహ్లీ కన్నీళ్లు పెట్టుకున్నాడు. సెంచరీ చేసినా జట్టును గట్టెక్కించ లేక పోయాడు.
Also Read : Rashid Khan